Rohit Sharma : ముందే ఊహించాడు.. 13 ఏళ్ల కిందే చెప్పేశాడు... రోహిత్ పాత ట్వీట్ వైరల్!

రోహిత్ శర్మ చాలా ఏళ్ల క్రితం పెట్టిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పాత పోస్ట్‌లో ఉన్న 45, 77 నంబర్‌లే దీనికి ముఖ్య కారణం. ఈ నంబర్‌లకు ప్రస్తుత పరిణామాలతో సరిగ్గా సరిపోవడంతో ఆసక్తికరంగా మారింది.

New Update
rohit 77

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour) అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ వన్డేలు, టీ20లు రెండింటికీ జట్లను శనివారం ప్రకటించింది. భారత వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ కు ప్రమోషన్ దక్కింది. రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్సీ దక్కింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ(rohit-sharma) చాలా ఏళ్ల క్రితం పెట్టిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పాత పోస్ట్‌లో ఉన్న 45, 77 నంబర్‌లే దీనికి ముఖ్య కారణం. ఈ నంబర్‌లకు ప్రస్తుత పరిణామాలతో సరిగ్గా సరిపోవడంతో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ లో రోహిత్ ఏం అన్నాడంటే ఒక శకం (45) ముగింపు .. కొత్త శకం ప్రారంభం (77) అని ట్వీట్ చేశాడు. 

2012లో టీ20 ప్రపంచకప్‌(t20-world-cup) కు వెళ్లే సమయంలో, రోహిత్ సాధారణంగా ధరించే 45 నంబర్ కాకుండా, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా 77 నంబర్ జెర్సీ ధరించాడు. ఆ సమయంలో తన ఆటతీరు బాగోలేకపోవడం, జట్టులో స్థానం పదిలం కాకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని, తన పాత ఫామ్ ముగిసి, కొత్త ఫామ్ మొదలవుతుందని ఆ పోస్ట్ పెట్టాడు.  13 ఏళ్ల తర్వాత, రోహిత్ 45 నంబర్ శకం ముగియడం, గిల్ 77 నంబర్ శకం ప్రారంభం అవ్వడం యాదృచ్ఛికంగా సరిపోలడం చూసి, అభిమానులు ఈ ట్వీట్‌ను  వైరల్ గా మారింది.  రోహిత్ తన భవిష్యత్తును తానే చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. భారత జట్టులో 45వ నంబర్ రోహిత్ తో ముడిపడి ఉంది. రోహిత్ ఒకప్పుడు జెర్సీ నంబర్ 77 ధరించాడని కొద్దిమంది అభిమానులు మాత్రమే గుర్తుంచుకుంటారు. 13 సంవత్సరాల తరువాత అదే నంబర్ 77 అతని స్థానంలో భారత కెప్టెన్‌గా రావడం యాదృచ్చికం అని చెప్పాలి. 

Also Read :  భారత్ నాకు దేవాలయం.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!

ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వన్డే, టీ20 జట్లు : 

వన్డే టీమ్ :  గిల్‌(కెప్టెన్‌), రోహిత్‌, కోహ్లీ, శ్రేయాస్‌(వైస్‌ కెప్టెన్‌), అక్షర్‌పటేల్‌, నితీశ్‌కుమార్‌, సుందర్‌, కుల్దీప్‌, హర్షిత్‌ రానా, సిరాజ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, జురెల్‌, జైస్వాల్‌.


టీ20 టీమ్‌: సూర్యకుమార్‌(కెప్టెన్‌), అభిషేక్‌, గిల్‌(వైస్‌ కెప్టెన్‌), తిలక్‌వర్మ, నితీశ్‌కుమార్‌, దూబే, అక్షర్‌పటేల్‌, జితేశ్‌శర్మ, వరుణ్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్‌, కుల్దీప్‌, హర్షిత్‌, శాంన్‌, రింకూసింగ్‌, సుందర్‌.

Also Read :  Team India ODI Squad: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత్ బలమైన స్క్వాడ్ ఇదే..

Advertisment
తాజా కథనాలు