Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!

మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

New Update
viral news

viral news

Hyderabad:  హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు(hijra) దారుణానికి తెగబడ్డారు.   కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. కీసర మండలం చీర్యాల్ శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సదానందం అనే వ్యక్తి ఇటీవల తన కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. 

Also Read :  నెల్లూరులో లారీ బీభత్సం.. ముగ్గురు దుర్మరణం!

డబ్బులు ఇవ్వాలని డిమాండ్ 

అయితే ఆదివారం రోజున ఇంటి ముందు మిగిలిపోయిన చిన్న చిన్న పనులు చేసుకుంటుండగా, ఇద్దరు హిజ్రాలు ఇంటి వద్దకు వచ్చారు. కొత్త ఇల్లు కట్టవు కదా.. రూ. లక్ష ఇవ్వు అని డిమాండ్ చేశారు. దీనికి సదానందం నిరాకరించడంతో ఆ ఇద్దరు హిజ్రాలు అతడిని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మూడు ఆటోల్లో .. 

అప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోయిన హిజ్రాలు.. కొద్దిసేపటికి మూడు ఆటోల్లో దాదాపు 15 మంది హిజ్రాలు గుంపుగా తిరిగి అక్కడికి చేరుకున్నారు. వచ్చి రాగానే ఇంటి గేటును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. దీంతో సదానందం, అతడి కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చి ఆపే ప్రయత్నం చేయగా.. వారిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.  ఈ దాడిలో ఇంటి యజమాని సదానందం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణ చూసి చుట్టు పక్కన ప్రజలు అక్కడికి రావడంతో హిజ్రాలు భయపడి పారిపోయారు.  ఇంటి యజమాని సదానందం ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Andhra King Taluka: హీరో రామ్ ఊరమాస్ స్టెప్పులు.. 'ఆంధ్రా కింగ్ ' తాలూకా సాంగ్ వచ్చేసింది!

Advertisment
తాజా కథనాలు