Crime: తల్లి వివాహేతర సంబంధం.. ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కొడుకు

తమిళనాడులో దారుణం జరిగింది. కన్నతల్లినే కొడుకు ఇనుపరాడ్డుతో కొట్టి చంపడం కలకలం రేపింది. నెల్లై జిల్లా ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో కొడుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు.

New Update
Crime

Crime

తమిళనాడు(tamilnadu)లో దారుణం జరిగింది. కన్నతల్లినే కొడుకు ఇనుపరాడ్డుతో కొట్టి చంపడం(son kills mother) కలకలం రేపింది. నెల్లై జిల్లా ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం(Illegal Affair) పెట్టుకుందనే కారణంతో కొడుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎడుప్పల్‌లో పుల్వాండి, రెజీనా(43) దంపతులకు కొంబయ్య(22), వినోద్(13) ఇద్దరు కొడుకులు. కొంబయ్య కూలీ పనిచేస్తుండగా.. వినోద్ 8వ తరగతి చదువుతున్నాడు.  

రెండేళ్ల క్రితం రెజానీ భర్త పూల్పాండి చనిపోయాడు. దీంతో రెజీనా తన కొడుకులతో కలిసి ఉంటోంది. అయితే కొన్ని రోజులుగా రెజీనాకు, ఆమె పెద్దకొడుకు కొంబయ్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. శక్రవారం వాళ్ల గ్రామంలో ఆలయ ఉత్సవం జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కొంబయ్య మళ్లీ తల్లితో గొడవ పడ్డాడు. కోపంతో క్షణికావేశంలో తల్లి తలపై ఇనుప రాడ్డుతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి కొంబయ్య పారిపోయాడు. చుట్టుపక్కలవారు విగతజీవిగా పడిఉన్న రెజీనాను చూసి షాకైపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. అయితే రెజీనా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. 

Also Read: దారుణం.. 22 ఏళ్ల మహిళపై ఐదుగురు అత్యాచారం

Man Kills His Mother Over Her Illegal Affair

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తల్లి వివాహేతర సంబంధం గురించి కొంబయ్యకు తెలియగా అతడు ఆమెను మందలించాడు. అయితే శుక్రవారం రాత్రి ఆలయ ఉత్సవం చూసి కొంబయ్య అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి రెజీనా, ఆ యువకుడు ఏకాంతంగా ఉండటం చూశాడు. కొంబయ్యను చూసి ఆ యువకుడు పారిపోయాడు. దీంతో కొడుకు తల్లితో గొడవ పడి ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. చివరికి పోలీసులు కొంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలాఉండగా తెలంగాణలోని కరీంనగర్‌లోని టేకుర్తి గ్రామంలో మరో దారుణం జరిగింది. తల్లి వరుస అయ్యే మహిళను కొడుకులు దారుణంగా హత్య చేశారు. ఆమె గర్భంతో ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. టేకుర్తికి చెందిన రాములుకి భార్య ఉండేది. ఈమె చనిపోయిన తర్వాత అతడు తిరుమల అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రాములు మొదటి భార్య కొడుకులు రాజశేఖర్, రాజకుమార్‌. అయితే వీళ్లిద్దరికీ తండ్రి రెండో  పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో వాళ్లింట్లో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతునే ఉన్నాయి. 

Also Read: ఏనుగు, డ్రాగన్ కలిసి అమెరికాపై దండయాత్ర.. SCO సమ్మిట్‌లో కీలక పరిణామం

అయితే రాములు తన ఇంటిని రెండో భార్య తిరుమల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో కొడుకులు, తండ్రి మధ్య గొడవలు మరింత పెరిగిపోయాయి. అంతేకాదు తిరుమల గర్భంతో ఉంది. ఆమెకు పుట్టబోయే పిల్లలు కూడా ఆస్తి పంపకాల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని రాములు మొదటి భార్య కొడుకులు అనుమానించారు. తాజాగా తండ్రి ఇంట్లో లేని సమయం చూసి ఆమెతో గొడవపడ్డారు. చివరికి ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అనంతరం రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

Advertisment
తాజా కథనాలు