/rtv/media/media_files/2025/08/31/odisha-2025-08-31-15-06-53.jpg)
ఒడిశా(Odisha) లో దారుణం జరిగింది. మయూర్‌భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం(rape) చేశారు. ఇందులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. బాధితురాలికి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకున్నాని తీసుకువెళ్లారు. ఆమెను బంగిర్పోసిలోని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదాల పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తరువాత కారులో వీరితో పాటుగా మరో ఐదుగురు చేరారు. అలా బాధితురాలిని ఉడాల, బాలసోర్ పట్టణాన్ని కలిపే ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తనను రోడ్డుపై ఒంటరిగా వదిలేశారని బాధితురాలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : SCO summit: ఏదో జరగబోతోంది.. చైనా ప్రధానికి ఇష్టమైన కారు మోదీకి కేటాయింపు
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో మరో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు(Dowry Harassment) మరో ఇల్లాలు బలి అయిపోయింది. వరకట్నం వేధింపులకు గురైన ఓ వివాహితకు ఆమె అత్తింటివారు బలవంతంగా యాసిడ్ తాగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వివాహిత 17 రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహ్‌పూర్ జిల్లాలో జరిగింది. గుల్ ఫిజా అనే బాధితురాలికి ఏడాది క్రితం అమ్రోహాలోని కాలా ఖేడా గ్రామానికి చెందిన పర్వేజ్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి తన కుమార్తెను ఆమె భర్త, అత్తమామలు,ఇతర కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారని గుల్ ఫిజా తండ్రి ఫుర్ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read : Pressure cookers: ప్రెషర్ కుక్కర్ అలానే వాడేయకండి.. దానికీ ఎక్స్‌పైరీ ఉంటుంది..!!
2025 ఆగస్టు 11న, గుల్ ఫిజా అత్తమామలు తన కూతురికి బలవంతంగా యాసిడ్ తాగించారని ఫిర్యాదులో ఆమె తండ్రి ఆరోపించాడు. దీంతో వెంటనే తమ కూతుర్ని మొరాదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ 17 రోజులు చికిత్స పొందిన గుల్ ఫిజాను వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు. చికిత్స సమయంలోనే ఆమె మరణించింది. పోస్ట్‌మార్టం కూడా మొరాదాబాద్‌లో జరిగింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, భర్త పర్వేజ్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, ఇతర అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోస్ట్ మార్టం నివేదిక తర్వాత నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.