/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T112425.279.jpg)
crime
ఒక టీ షర్టు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో కేవలం రూ.300 టీషర్టు వల్ల చెలరేగిన వివాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అక్షయ్ అసోల్ టీ షర్టు కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్‌లో రూ.300 కు ఆర్డర్ పెట్టాడు. అయితే ఈ టీషర్టు అతనికి సరిపడకపోవడంతో శుభమ్‌కి ఇచ్చాడు. అతను టీ షర్టు డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....
తాగిన మత్తులో..
గొడవ పెద్దది కావడంతో శుభమ్ అక్షయ్‌ని తిట్టాడు. డబ్బులను కూడా అతనిపైకి విసరడంతో అక్షయ్ సోదరుడితో కలిసి శుభమ్‌ను గొంతు కోసి చంపేశారు. దీంతో అక్కడిక్కడే శుభమ్ మృతి చెందాడు. అయితే ఈ ఘటన సమయంలో అక్షయ్, తన సోదరుడు మద్యం తాగి ఇలా చేశారు. పోలీసులు వెంటనే వీరిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. శుభమ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!
ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని హత మార్చేందుకు భారీ సుపారి ఇచ్చిన ఘటన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెళ్లి చేసిన వ్యక్తిని కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు రెక్కీ చేస్తుండగా నిందితులు అనుకోకుండా పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో అసలు విషయం బయటపడగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: America: అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం!
ఏ.కొడూరు మండలం కొండూరుకు చెందిన రమ్య శ్రీ అనే యువతి.. నందిగామ మండలం ఐతవరంకు చెందిన మొవ్వ వీర్రాజును ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీర్రాజు, రమ్యశ్రీల ప్రేమ వివాహానికి వీర్రాజు సమీప బంధువు మొవ్వ గోపి సహకరించాడు. దీంతో గోపిపై కక్ష పెంచుకున్న రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు గోపిని హతమార్చేందుకు భారీ ప్లాన్ వేశాడు.
ఇది కూడా చూడండి: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!