Local Boy Nani: యూట్యూబర్‌ లోకల్‌బాయ్‌ నానికి బిగ్‌షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం!

యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసినందుకు విశాఖలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పాడు.

New Update

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లలో వీడియోలు పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు విశాఖ పట్నంకి చెందిన నాని. దీంతో లోకల్ బాయ్ నానిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియో చేస్తూ యూట్యూబర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా అతడికి బిగ్‌షాక్ తగిలింది. విశాఖలో నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Trump-Musk:మస్క్‌ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్‌ మార్చేసిన ట్రంప్‌!

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్నారని అతడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పారు. 

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

ఏం జరిగింది?

యూట్యూబర్ లోకల్ బాయ్ నాని తన వీడియోలతో ఎంతో పాపులర్ అయ్యాడు. సముంద్రంలో చేపలు పడుతూ చేసిన వీడియోలకు వేలల్లో లైక్స్, వ్యూస్ సంపాదించుకుంటున్నాడు. ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో తనకున్న ఫాలోయింగ్‌ను నాని సొమ్ముచేసుకునేందుకు ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. 

ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ విషయంలో అతడిపై మండిపడ్డారు. ఇప్పటికే ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మళ్లీ వాటినే ప్రమోట్ చేయడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. దీనిపై ఐపీఎస్ సజ్జనార్ సైతం ఫైర్ అయ్యారు. ఆ వీడియోను తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసి బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ ఆపాలంటూ చెప్పారు. 

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయని.. కానీ ఇవేం దిక్కు మాలిన పనులు అంటూ ఫైర్ అయ్యారు. మీ టాలెంట్‌ను ఉపయోగించి ఇతర రంగాలలో సంపాదించుకోవడంలో తప్పులేదని.. అలా చేస్తే సమాజం కూడా మిమ్మల్ని ప్రశంసిస్తుందని అన్నారు. ఇలాంటి పనులు చేసి ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం సరికాదని అన్నారు. దీంతో సజ్జనార్ ట్వీట్‌పై నాని క్షమాపణలు చెప్పాడు. ఇక ఇదే విషయంలో ఇప్పుడు నానిపై కేసు నమోదు అయింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు