Illegal Activities In SPA: యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం.. కండోమ్‌లతో నిండిన గదులు.. 23 మంది అరెస్టు!

విజయవాడలో వ్యభిచారం గుట్టు రట్టైంది. వెటర్నరీ కాలనీలో చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నడిపిస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. 10 మంది మహిళలు, 13 మంది విటులను అరెస్ట్ చేశారు. 

New Update
vjayawada spa

Vijayawada prostitution case 10 women and 13 men arrested

Illegal Activities In SPA: విజయవాడ(Vijayawada)లో మరో వ్యభిచారం(Adultery) గుట్టు రట్టైంది. బయట యూట్యూబ్ ఛానల్(YouTube Channel) పేరుతో బోర్డు పెట్టి స్పా సెంటర్(Spa Center) నడిపిస్తున్న నిర్వాహకులు అందులోనే గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు చేయగా అసలు బాగోతం బయటపడింది. గదులు, బాత్రూముల్లో కండోమ్ ప్యాకెట్లు(Condom Packets), విలువైన మసాజ్ ఆయిల్స్(Massage Oils) సైతం గుర్తించగా ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: Trump-Musk:మస్క్‌ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్‌ మార్చేసిన ట్రంప్‌!

నార్త్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి..

ఈ మేరకు చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9,( స్పా)పై  సిబ్బందితో కలసి రైడ్ చేసి యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించాం. 10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళలంతా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.

Also Read: CM Revanth: బీసీ కులగణనపై బీజేపీ కుట్ర ఇదే.. రేవంత్ సంచలన ప్రెస్ మీట్!

ఇక భార్గవ్ అనే వ్యక్తిపై గతంలో కూడా స్పా సెంటర్ వ్యవహారంలో కేసు నమోదైనట్లు తెలిపారు. అయితే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని మళ్లీ దందా మొదలుపెట్టిన భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. స్పా సెంటర్ల గలీజ్ పనులపై సమాచారం ఇచ్చిన వారి వివరాలను గొప్యంగా ఉంచుతామని చెప్పారు.

Also Read: Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు