Vedarajuu Timber : మడత కాజా నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూత

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.  నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు.  గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు.

New Update
Vedarajuu Timber

Vedarajuu Timber Photograph: (Vedarajuu Timber)

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.  నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు.  గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు.  ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  

కన్‌స్ట్రక్షన్స్ బిజినెస్ చేసే వేదరాజు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అల్లరి నరేష్ తో మడతకాజా, సంఘర్షణ సినిమాలు తీశారు. ఇందులో మడతకాజా సూపర్ హిట్ కాగా..  సంఘర్షణ ఆకట్టుకోలేదు. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన 2021లో  హీరో శ్రీవిష్ణుతో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు. వేదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.  

ఒక గొప్ప నిర్మాత అనారోగ్య సమస్యలతో మరణించడం నిజంగా బాధాకరమని పలువురు నెటిజన్స్ సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read : Madha Gaja Raja : విశాల్ మదగజరాజ సినిమాను రిజెక్ట్ చేసిన నలుగురు స్టార్ హీరోయిన్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు