NAGOBA JATARA : నాగోబా జాతరలో నేడు కీలక ఘట్టం... దర్బార్ కు నేటికి ఎన్నేండ్లంటే...?

ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. జాతరలో దర్బార్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

New Update
NAGOBA JATARA

NAGOBA JATARA

NAGOBA JATARA : ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. జాతర 3వ రోజున జాతరలో అతి ముఖ్యమైన దర్బార్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఇవాళ నాగోబా దర్బార్, రేపు బేతల్ పూజలు, మండగాజిలింగ్.. ఎల్లుండి షాంపూర్ జాతర జరుగుతాయి. గిరిజనుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం దర్బార్ నిర్వహిస్తారు. సమస్యలను నేరుగా అధికారులు-ప్రజాప్రతినిధులకు తెలిపేందుకు దర్బార్ జరుగుతుంది. 1942లో మొట్టమొదటిసారి నాగోబా దర్బార్ నిర్వహించారు.  1940లో గిరిజన పోరాట యోధుడు కొమ్రంభీం వీర మరణం తర్వాత నిజాం ప్రభుత్వపై ఆదివాసీల్లో వ్యతిరేకత మొదలైంది. దీంతో గిరిజనుల తిరుగుబాటుకు కారణం ఏమిటనే విషయాలను తెలుసుకునేందుకు నిజాం ప్రభుత్వం మానవ పరిణామ శాస్త్రవేత్త లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించింది.

Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!

హైమన్‌ డార్ఫ్‌ తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో కలిసి జైనూర్‌ మండలం మార్లవాయికి వచ్చి అక్కడే స్ధిరపడ్డారు. ఆయన ఆదివాసీల జీవితలపై అధ్యయనంచేసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అందులో భాగంగా ప్రతి ఏడాది కేశ్లాపూర్‌ లో జరిగే నాగోబా జాతరలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో కలుసుకుంటారని గమనించారు. ఈ జాతరకు జిల్లాలోని ఆదివాసీలే కాకుండా పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా ఆదివాసీలు ఎండ్లబండ్లపై తరలిరావడం ఆయన దృష్టిలో పడింది. జాతర నిర్వహణ ఉన్న రోజుల్లో ఒకరినొకరు వారి వారి కష్టాలు పంచుకోవడం హైమన్ డార్ప్ దృష్టిలో పడింది. జాతరకు వచ్చే ఆదివాసీలందరూ చర్చింకునేలా ఒక వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని డార్ప్ నిజాం సర్కార్ను ప్రతిపాదించారు. దానికి నిజాం సర్కార్ ఒప్పుకోవడంతో పాటుగా ఆదివాసీలు ఒప్పుకోవడంతో 1942 నుండి నాగోబా సన్నిధిలో గిరిజన దర్బార్ ప్రారంభమైంది. అప్పటి నుండి నాగోబా జాతరలో దర్భార్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రారంభమైన దర్భార్ ఈ ఏడాది 78 వసంతాలు పూర్తి చేసుకుని 79లోకి అడుగిడనుంది.

Also Read: America: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

ఆయన సూచన మేరకు తొలిసారి 1942లో దర్మార్‌ నిర్వహించారు.తొలిసారి నిర్వహించిన ఈ దర్బార్ హేమన్ డార్ఫ్ ఆధ్వర్యంలో జరిగింది. నాగోబా జాతర సందర్భంగా ఈ సారి నాగోబా సన్నిధిలో నిర్వహించే దర్భారుకు 78 ఎళ్లు. ఈ దర్బార్‌లో గిరిజనులు అధికారుల వద్ద తమ సమస్యలను చెప్పుకునేవారు. అధికారుల ద్వారా వారి వినతులు నిజాం ప్రభుత్వానికి చేరేవి. ప్రభుత్వం వాటిని పరిష్కరించేది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుంది.

Also Read: USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..

హేమన్ డార్ఫ్ మొదలు పెట్టిన దర్బార్ నేటికీ కొనసాగుతోంది. దర్బార్ కోసం గిరిజనులు-ఆదివాసీలు భారీగా తరలిరానున్నారు.నిజానికి ఈసారి దర్బార్‌కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రావలసి ఉండే, అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉండడంతో ఈ సారి నామమాత్రాంగానే దర్బార్ జరుగుతుంది. కాగా, జాతరకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు

ఈ నెల 28న నాగోబాకు మహా పూజలతో ప్రారంభమైన నాగోబా జాతరలో దర్బార్ కీలకమైంది. దర్బార్ రోజున తెలంగాణ జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలివస్తారు. దర్భారులో ఆదివాసీలు తమ సమస్యలను ప్రజా ప్రతినిధులకు, ఆఫీసర్లకు విన్నవిస్తారు.దాంతో ఇక్కడ పాలకులు ఇచ్చే హామీలు నెరవేరుతాయని వారి విశ్వాసం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నిర్వహిస్తున్న నాగోబా జాతరలో భాగంగా గురువారం నాగోబా టెంపుల్ వెనుక మెస్రం వంశీయులు పెర్సపేన్, భాన్ దేవతకు ఘనంగా పూజలు నిర్వహించారు. భేటింగ్ అయిన కొత్త కోడళ్లు టెంపుల్​కు చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నాగోబా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. నాగోబాను దర్శించుకుంటున్నారు.

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

  గోవడ్ లో బస చేసిన మెస్రం వంశస్తులు గురువారం నాగోబా టెంపుల్ వెనుక భాగంలో పెర్సపెన్ దేవుడికి పూజలు చేశారు. అంతకు ముందు ఇంటి నుండి తీసుకొచ్చిన నైవేద్యాలను జమ చేశారు. పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసిన తర్వాత పెర్సపెన్ దేవుడు పూజలకు మెస్రం వంశీయులు పూనుకున్నారు.నాగోబా సన్నిధిలోకి చేరుకున్న మెస్రం వంశంలో అడుగిడిన కొత్త కోడళ్లు సంప్రదాయం ప్రకారం భాన్ దేవత వద్దకు ప్రధాన కితకు చెందిన వారు డోలు, పిప్రి, కాలికోమ్ లతో వచ్చారు. అక్కడ బస చేసిన అనంతరం వంశ కొత్త కోడళ్లు నెత్తిపై కుండలతో శోభాయాత్రగా మర్రిచెట్టు వద్ద ఉన్న పవిత్ర బావి (కోనేరు)కు చేరుకున్నారు. ఆ కుండలలో నీటి తో భాన్ దేవత వద్దకు చేరుకున్నారు. ఆ పవిత్రజలం, మట్టి కలయికతో భాన్ దేవత విగ్రహంను తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు

 నాగోబా జాతర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శుక్రవారం దర్భార్ నిర్వహిస్తున్నందున ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారుగా ఆరు వందల మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు. దర్బార్ నేపథ్యంలో బందోబస్తుపై పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో నాగోబా జాతరలో శుక్రవారం దర్భార్ నిర్వహిస్తున్నందున ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు సమస్యలపై విన్నవించేందుకు దర్భార్కు రానున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సెలవు దినంగా ప్రకటించారు.

Also Read:USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు