America: సిరియా పై విరుచుకుపడిన అమెరికా..మోస్ట్‌ వాటెండ్‌ సీనియర్‌ ఉగ్రవాది హతం!

సిరియాలోని వాయువ్య ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అల్‌ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టింది.తీవ్రవాద గ్రూపులను నాశనం చేసే క్రమంలో ఈ దాడులు జరిగినట్లు వివరించాయి.

New Update
bomb

సిరియాలోని వాయువ్య ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అల్‌ ఖైదా అనుబంధ  ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనను చేసింది. జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్-దిన్ అనే గ్రూప్‌తో అతను సంబంధాలు కలిగి ఉన్నాడు.

Also Read: America: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ సైనిక చీఫ్ మహ్మద్ దైఫ్ మరణించినట్లు ధృవీకరించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్  ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఈ నిర్ధారణ వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం, హమాస్ ప్రతినిధి అబు ఒబైదా వీడియో ప్రకటనలో దైఫ్ మరణాన్ని ధృవీకరించారు. జులై 13న ఖాన్ యునిస్ ప్రాంతంలో వైమానిక దాడిలో మహ్మద్ దైఫ్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ ఆగస్టు 2023లో ప్రకటించింది. 

Also Read: BIG BREAKING: తెలంగాణలో షాకింగ్ కొత్త వైరస్.. సిద్దిపేటలో తొలి కేసు!

వందల మంది కిడ్నాప్‌...

2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో 1200 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా వందల మంది కిడ్నాప్‌కు గురయ్యారు. దీని తరువాత, ఇజ్రాయెల్ హమాస్‌కు ప్రతీకారంగా గాజాలో 46000 మందికి పైగా పాలస్తీనియన్లను మట్టుపెట్టింది.

ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఈ ఒప్పందం ప్రకారం బందీలు, ఖైదీల మార్పిడి జరిగింది. గురువారం 110 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఇజ్రాయెల్ నుండి 8 మంది బందీలను హమాస్ విడుదల చేయగా... వీరిలో ఐదుగురు థాయ్ వ్యవసాయ కార్మికులు, ముగ్గురు జర్మన్-ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు.

Also Read:USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..

Also Read: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు