చంపడంలో పీహెచ్‌డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్!

బాలయ్య 'డాకు మహారాజ్‌' జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ''ఎవరైనా చదవడంలో మాస్టర్స్‌ చేస్తారేమో.. నేను చంపడంలో చేశా'' అనే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

New Update

Daaku Maharaaj Release Trailer:  బాలయ్య- బాబీ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్  లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. బాలయ్య పవర్ ఫుల్, డైలాగులు, స్రీన్ ప్రజెన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ''ఎవరైనా చదవడంలో మాస్టర్స్‌ చేస్తారేమో.. నేను చంపడంలో చేశా'' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్ థమన్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 

Also Read:Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా


ప్రీ రిలీజ్ క్యాన్సిల్ 

ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే అనంతపురంలో  డాకు మహారాజ్ భారీగా ప్లాన్ చేయగా.. క్యాన్సిల్  అయ్యింది. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఈవెంట్ జరపడం సరికాదని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఆవేదన

Advertisment
తాజా కథనాలు