నాతో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు!

రాహుల్‌ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నాగాలాండ్‌ మహిళా బీజేపీ ఎంపీ కొన్యాక్ సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్న టైంలో దగ్గరగా వచ్చి బిగ్గరగా అరిచారని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు దీనిపై లేఖ రాశారు.

author-image
By srinivas
New Update
ఒఆ

ఒఒఆ Photograph: (దది)

National: రాహుల్‌ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నాగాలాండ్‌ మహిళా బీజేపీ ఎంపీ కొన్యాక్ సంచలన ఆరోపణలు చేశారు. అంబేడ్కర్ వివాదంలో పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్న టైంలో రాహుల్ గాంధీ ప్రవర్తనతో తాను ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పారు. రాజ్యసభలోనూ ఈ అంశంపై మాట్లాడిన కొన్యాక్ ఆ తర్వాత రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు దీనిపై లేఖ రాశారు.

 

నా గౌరవం, ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది..

అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంట్‌ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసనలు గందరగోళానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాగా ఫ్లకార్డు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో రాహుల్‌ గాంధీ తన దగ్గరకు వచ్చి బిగ్గరగా అరిచారని కొన్యాక్ చెప్పారు. 'రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారు. ఒక మహిళగా ఎంతో అసౌకర్యానికి గురయ్యాను. చాలా బాధ పడ్డాను. ఆయన తీరుతో పక్కకు తప్పుకున్నా. ఒక పార్లమెంట్‌ సభ్యుడిగా రాహుల్ గాంధీ ప్రవర్తన సరైనది కాదు. ఆయన వల్ల నా గౌరవం, ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఆదివాసీ వర్గానికి చెందిన నాకు మీరే రక్షణ కల్పించాలి’ అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు.. పార్లమెంటు ప్రాంగణంలో గురువారం ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్ష ఎంపీల మధ్య తోపులాట చేసుకోవడంతో ఇద్దరు బీజీపీ ఎంపీలు గాయపడ్డారు. విపక్ష నేత రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ తోపులాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తోటి ఎంపీలపై దాడి చేసిందుకు స్పీకర్ ఓంబిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్?

 ఈ ఘటనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీలు దాడి చేశారని, ఇద్దరు ఎంపీలను తోసేశారంటూ ఆరోపించారు. ప్రతాప్ సింగ్ సారంగీ, ముఖేష్ రాజ్‌పుత్‌లకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. రాహుల్ గాంధీపై తగిన చర్యలు తీసుకుంటామని.. గాయపడిన ఎంపీలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. 

ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి..

'ఒక మహిళా నేత, రాజ్యసభ సభ్యురాలు పట్ల పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించడం చాలా అవమానకరం. ఇలాంటి అనుచిత ప్రవర్తనతో మీరు, మీ అనుచరులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ఎంపీ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించారంటే, మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే భయంగా ఉంది. మీకు మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఫాంగ్నాన్ కొన్యాక్‌కి క్షమాపణలు చెప్పండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు