Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్.. ఇకపై ఆ అవసరం లేదు!

నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కి భారీ ఊరట లభించింది. ఇక పై ప్రతి ఆదివారం కోర్టుకు హాజరు కావాలనే నిబంధనను మినహాయించింది. దీంతోపాటు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించింది.

New Update

Allu Arjun: సంధ్యా థియేటర్ ఘటన కేసులో సినీ హీరో అల్లు అర్జున్ కి బిగ్ రిలీజ్ లభించింది.  ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ప్రకటించిన నాంపల్లి కోర్టు.. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధనపై తాజాగా కోర్టు బన్నీకి ఊరట కల్పించింది.  ఇకపై ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలనే నిబంధనను మినహాయించింది. దీంతోపాటు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించింది.

అల్లు అర్జున్ అరెస్టు

డిసెంబర్ 4న  పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్యా థియేటర్ వద్ద భారీగా తొక్కిసలాట జరగడంతో రేణుక అనే మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ 12న అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన పోలీసులు   నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. రీసెంట్ గా బెయిల్ గడువు ముగియడంతో.. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకోగా.. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ నిర్లక్ష్యమే ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమని అసెంబ్లీ వేదికగా చెప్పడంతో.. బన్నీ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడులు కూడా చేశారు. ఇలా ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా అల్లు ఫ్యామిలీ తీవ్ర బాధను అనుభవించింది అనే చెప్పాలి. ఇక ఇటీవలే రెగ్యులర్ బెయిల్ రావడంతో అంతా ఊపిరిపీలుసుకున్నారు. 

Also Read: చంపడంలో పీహెచ్‌డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు