Crime News: దారుణం.. టీచర్‌ అనుమానాస్పద మృతి.. తీవ్ర గాయాలతో భర్త

ఏలూరులో 35 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన సురేంద్ర కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు ఉన్నాయి. స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Tirupati Crime News

Crime News

ఏలూరు శివారులోని చోదిమెళ్లకి చెందిన 35 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె భర్త సురేంద్ర కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. సురేంద్ర కాళ్లు, చేతులకు బ్లేడ్‌తో కోసిన గాయాలు, రక్తం కారుతుండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దేవికకు, సురేంద్రకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

అనుమానస్పద మృతి..

దంపతులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అయితే కుటుంబంలో ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. కానీ దేవిక ఉరివేసుకుని అనుమానాస్పదంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దేవిక మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

పోలీసులు సురేంద్ర, దేవిక మధ్య కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేదా వారి వృత్తి పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దేవిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’

ఇది కూడా చూడండి: Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!

Andhra Pradesh | eluru | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు