Shiva Jyothi: తిరుమల ప్రసాదం వివాదం.. సారీ చెప్పిన శివజ్యోతి

తిరుమల ప్రసాదంపై రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ యాంకర్‌ శివజ్యోతి  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజెన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా శివజ్యోతి స్పందించారు.

New Update
Anchor Shiva jyothi

Anchor Shiva jyothi

తిరుమల ప్రసాదంపై రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ యాంకర్‌ శివజ్యోతి  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజెన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా శివజ్యోతి స్పందించారు. తన మాటలకు ఎవరైన బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో దీనికి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. '' వేంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లకు ఇది తెలుసు.  

Also Read: రెండు సెకన్ల వీడియో.. 100 మిలియన్ల వ్యూస్‌..ఇంతకీ ఏం జరిగిందంటే?

Anchor Shiva Jyothi Comments On Tirumala Prasadam

ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడలేదు. మేము ఎల్‌1 క్యూలో ఉన్నాం. దాన్ని ఉద్దేశించి మాత్రమే అన్నాను. నా జీవితాన్ని మార్చిన వేంకటేశ్వర స్వామిపై నేనెందుకు కామెంట్స్ చేస్తాం. తెలిసో తెలీకో మాట్లాడినందుకు నా తమ్ముడి తరఫున కూడా క్షమాపణలు కోరుతున్నానని''శివజ్యోతి చెప్పుకొచ్చారు. 

Also Read: కొత్త లేబర్ కోడ్..కార్మికులకు అదనపు భద్రత, సంక్షేమం

ఇదిలాఉండగా ఇటీవల శివజ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అక్కడ క్యూలైన్‌లో ప్రసాదం తీసుకుంటుండగా.. కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం. రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ వీడియోలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా స్పందించారు.  

Advertisment
తాజా కథనాలు