Crime Story: మొన్న మీర్‌పేట.. నిన్న సూర్యాపేట.. మంటల్లో మానవత్వం!

మానవ సమూహాల్లో నేరాలు, ఘోరాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచ నలుమూలల నిమిషానికొక మర్డర్, రేప్, దోపిడి జరుగుతూనే ఉంది. కులం, మతం, ప్రేమ, ఆస్తి పేరిట రక్తపాతం సృష్టిస్తున్నారు. సమాజాన్ని కలవరపెడుతున్న భయంకరమైన కొన్ని ఘటనలు ఈ ఆర్టికల్ లో చదివేయండి.

New Update
crimes

Crime rate Increasing worldwide

Crime Story: మానవ సమూహాల్లో నేరాలు, ఘోరాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచ నలుమూలల ప్రతిరోజు నిమిషానికొక మర్డర్, రేప్, దోపిడి.. ఇలా ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారత దేశంలో క్రైమ్ రేట్ మరింత దారుణంగా పెరిగిపోతుంది. కశ్మీర్ టూ కన్యాకుమారి, ఢిల్లీ టూ గల్లీ ఎక్కడ చూసిన మానవులు తెగబడి నరుక్కుంటున్నారు. కులం పేరిటా, మతం పేరిటా, ప్రేమ, వివాహేతర సంబంధాలు, డబ్బులు, ఆస్తికోసం కత్తులు దూసుకుంటున్నారు. ఈ భూమిమీద అత్యంత తెలివైన ప్రాణుల్లో మొదటిస్థానం సంపాదించుకున్న మనిషి.. ఇప్పుడు జంతు ప్రవృత్తికి మించి ప్రవర్తిస్తున్నాడు. పెళ్లం మాట వినలేదని ఒకడు, లవర్ మోసం చేసిందన మరొకడు, చెల్లి కులాంతరం వివాహం చేసుకుందని, తాత, తండ్రి ఆస్తికోసం మరికొందరు ఇలా వరుసపెట్టి రక్తపాతం సృష్టిస్తున్నారు. తాజాగా సూర్యపేటలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని అమ్మాయి అన్నలే చంపితే.. ప్రకాశం జిల్లాలో చెల్లి లైఫ్ ఇన్స్ రెన్స్ డబ్బులకోసం పేగుబంధానే మరిచాడు ఓ దుర్మార్గుడు. ఇక మీర్‌పేటలో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన సమాజాన్ని కలవర పెడుతోంది. 

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లినే..

చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ అన్ననే సమాజం సిగ్గుపడే చర్యకు పాల్పడ్డాడు. కేవలం డబ్బు మీద పిచ్చితో తోడబుట్టిన ఆడపిల్లనే అత్యంత క్రూరంగా హతమార్చిన ఘనట తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెంలో అశోక్ రెడ్డి అనే ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.  తన చెల్లి సంధ్యా పేరుపై కోటి ఇరవై లక్షలకుపైగా ఇన్సూరెన్స్ చేయించాడు. అయితే చెల్లి మరణిస్తే ఆ డబ్బులు తనకే దక్కుతాయని భావించిన అశోక్..  సంధ్యను కత్తితో పొడిచి  కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన చెల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రోడ్డు ప్రమాద ఆనవాళ్లు లభించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  అశోక్ చేసిన దారుణంపై తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. పైసలు కావాలంటే తమ ప్రాణాలు ఇచ్చేవారిమని, అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను కడుపున పెట్టుకున్నాడంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన ఆడపిల్లలున్న కుటుంబాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 

నానమ్మ అడిగిందని యువకుడి ప్రైవేట్ పార్ట్స్.. 

సూర్యాపేటలో పరువు హత్య సమాజాన్ని మరొక్కసారి కుదిపేసింది. మిర్యాలగూడ ప్రణయ్-, అమృతల ఘటనను పూర్తిగా మరువకముందే  కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు కృష్ణ హత్య కేసు సంచలనం రేపుతోంది. కృష్ణ భార్య భార్గవి తన అన్నలే భర్తను చంపేశారంటూ రోదిస్తోంది. అయితే తన నాన్నమ్మనే ఇదంతా చేయించినట్లు తెలపడంతో అందరూ కంగుతింటున్నారు. విపరీతమైన కుల పిచ్చితో ఉన్న భార్గవి నాయనమ్మ..  కులం తక్కువ వాడిని చేసుకున్నానని చాలా సార్లు దాడిచేసిందట. ఇంట్లో మగవాళ్లను రెచ్చగొట్టి కృష్ణ హత్యకు ఉసిగొల్పిందట. నాయనమ్మ కళ్ళలో ఆనందం చూడడానికి కృష్ణను చంపేశారని పోలీసుల విచారణలో బయటపడింది. అంతేకాదు కృష్ణ డెడ్ బాడీ చూపించగానే అతని ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి ఆ వృద్ధురాలు కోపం చల్లార్చుకోవడాన్ని చూస్తే సమాజంలో కులపిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

భార్యను నరికి ఉడికించిన భర్త.. 

హైదరాబాద్ మీర్‌పేట్  ఘనట దేశాన్నే కుదిపేస్తోంది. మాజీ జవాన్ గురుమూర్తి తన భార్య మాధవిని అత్యంత పాశవికంగా మర్డర్ చేశాడు. చిన్న చిన్న గొడవల కారణంగా మాధవిపై కక్షపెంచుకున్న గురుమూర్తి.. సంక్రాతి పండుగనాడే ఆమెను కడతేర్చాడు. మొదట ఆమెను గొడకేసి కొట్టి, స్పృహ కోల్పోయిన వెంటనే గొంతు పిసికేసి చంపాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించి డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేశాడు. ఆ ముక్కలను వాటర్ హీటర్ వాటర్ లో ఉడికించి, ఆ తర్వాత కాల్చి, దండి పొడిచేసి చెరువులో కలిపేశాడు. అయితే ఇదంతా గురుమూర్తి ప్లాన్ ప్రకారమే చేశాడని పోలీసులు చెబుతున్నారు. 

అతనిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించట్లేదని, అత్యంత క్రూరమ మనస్తత్వం కలిగివున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కనీసం ఇద్దరు చిన్న పిల్లల మోహం చూసికూడా తన మనసు కరగలేదని, ఇలాంటి నీచుడిని తమ సర్వీస్ లో చూడలేదని పోలీసు అధికారులు చెబుతున్నారంటే ఈ ఘటన ఎంత దారుణంగా ఉందో ఊహించడం కూడా కష్టమే. ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నందకు నిజంగా సిగ్గుగా ఉందంటున్నారు. మనిషి జంతు ప్రవృత్తికి మించి ప్రవర్తిస్తున్నాడని, మనిషిలో మానవత్వం మంటగలుస్తోందని చెప్పడానికి ఇలాంటి ఎన్నో ఘటనలు ఉదాహారణగా చెప్పుకొవచ్చు. 

Also Read:  Payal Rajput: థై స్లిట్ బాటమ్ లో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ.. పాయల్ ఫొటోలు చూస్తే అంతే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు