Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అఖండ పరిషత్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

author-image
By Madhukar Vydhyula
New Update
Maha Kumbh Mela-2025

Maha Kumbh Mela-2025

Maha Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు  భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఈ తొక్కిసలాట జరిగింది. కాగా తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

Also Read: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోవడానికి కోర్టుకెక్కిన కొడుకు


 కాగా, మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్‌ 2 వద్ద తొక్కిసలాట జరిగింది. సంగమం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా 40 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఎక్కువగానే భక్తులు మరణించినట్లుగా జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ వీటిని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.ఇదిలా ఉండగా.. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.


 Also Read: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం


మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభామేళాకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌ మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇవాళ దాదాపు కోటి మందికి పైగా అమృత స్నానాలు ఆచరించవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద 12 కిలోమీటర్ల పొడవున ప్రత్యేక ఘాట్‌ ఏర్పాటు చేశారు. అయితే అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని అఖండ పరిషత్‌ రద్దు చేసుకోవడంతో అమృత స్నానాలు ఆచరించే అవకాశం లేదని తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు