Chevella Accident  : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో రాజకీయం.. కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ Vs బీజేపీ-వీడియోలు!

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 24 కు చేరుకుంది. ఇద్దరు డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా ప్రమాదానికి మీరు అంటే మీరే కారణమని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నారు.

New Update
Chevella Bus Accident pic twelve

Chevella Accident

Chevella Accident : రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 24 కు చేరుకుంది. ఇద్దరు డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎమ్మెల్యేను తరిమిన స్థానికులు

ప్రమాద స్థలికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరుకున్నారు. కాగా, ఘటనా స్థలానికి వెళ్లిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను (Kale Yadaiah) స్థానికులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రోడ్డు వెడల్పు చేయాలని కొన్నేండ్లుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదందూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేశారని నిలదీశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడి నుంచి చేవెళ్ల దవాఖానకు వెళ్లిపోయారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. వైద్యులను బాధితుల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.కాగా, -- ప్రమాదాన్ని రాజకీయం చెయ్యొద్దు అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకుంటున్నారో బయటకు వస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం,-- ప్రమాద బాధితులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు.


రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్లే ప్రమాదం..మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి

కాగా చేవెళ్ల బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా పనులు చేపట్టలేదని విమర్శించారు. రోడ్డు పూర్తిగా గోతులతో నిండిపోయిందన్నారు. రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్షమే..ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి


కాగా ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రమాదస్థలికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ముమ్మాటికి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం అన్నారు. మోడీ గారు ఎక్స్‌గ్రేషియా  ప్రకటించారని తెలిపారు. చేవెళ్ళకు ఏమాత్రం సంబంధం లేని పర్యావరణ ప్రేమికులు చెట్లను కాపాడుతం అని చెప్పుకుంటూ, కేసులు వేసి, మా ప్రాంతం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన్రని ఆయన ఆరోపించారు. చేవెళ్ల రోడ్డు నిజాం కాలంలో నిర్మించారని పూర్తిగా వంకరటింకరగా ఉంటుందన్నారు. దీనికి కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. 2017లోనే నిధులు విడుదలైనప్పటికీ అపుడున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రోడ్డు పూర్తికాలేదన్నారు. స్థలాన్ని సేకరించడంలో ఆలస్యం చేసిందన్నారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న మర్రి వృక్షాలను తొలగించడం పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని కొంతమంది కోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. మర్రి చెట్టు పోతాయని వారు కేసే వేస్తే నేడు ప్రాణాలే పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్‌ కూడా ఆలస్యం చేసిందని ఆరోపించారు. 

ఇవాళ పొద్దున అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం గురించి తెల్వంగనే చేవెళ్ల కు పోయిన, బాధితులను పరామర్శించిన. ఇది ముమ్మాటికి గత...

Posted by Konda Vishweshwar Reddy on Sunday, November 2, 2025


 

Advertisment
తాజా కథనాలు