/rtv/media/media_files/2025/08/31/women-fighting-for-metro-seat-2025-08-31-13-26-44.jpg)
Women Fighting for Metro Seat
Viral Video: ఢిల్లీ మెట్రో(Delhi Metro) ప్రయాణం రోజు రోజుకి ఘోరంగా మారుతోందని నెటిజన్లు అబిప్రాయపడుతున్నారు. నిత్యం ఢిల్లీ మెట్రో కి సంబంధించి ఇదొక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరో ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీటు కోసం ఇద్దరు మహిళలు ఘర్షణకు దిగారు(Women Fighting for Metro Seat). తిట్ల పురాణం అందుకున్నారు, ఒకరిపై మరొకరు అరిచేసుకున్నారు. అడ్డుపడేందుకు మహిళా పోలీస్ వచ్చినా కానీ, వాళ్ల కోపం మాత్రం ఆగలేదు.
Also Read: 38 ఏళ్లకే క్యాన్సర్ తో ప్రముఖ హీరోయిన్ మృతి!
Kalesh b/w 2 ladiez inside delhi metro over a seat issue.
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 30, 2025
pic.twitter.com/P8Kkad2Ncx
అసలు విషయం ఏమిటంటే..?
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో, ఒక మహిళ మరొక మహిళాపై గట్టిగా అరుస్తోంది. అసలు విషయం ఏమిటంటే మెట్రోలో ఓ ఖాళీ సీటు కోసం ఇద్దరి మధ్య మొదలైన చిన్న మాట-మాట పెరిగి పెద్దదై బీభత్సంగా మారింది. చూస్తుండగానే పరిస్థితి చేజారిపోయింది.
Also Read:Human GPS Bagu Khan : వీడో హ్యూమన్ జీపీఎస్..చొరబాట్ల దారులన్నీ వీడి మైండ్‌లోనే...
ఘటన జరిగిన చోట ఓ మహిళా పోలీస్ కూడా ఉంది. ఆమె వారిని విడదీసేందుకు ప్రయత్నించినా, ఇద్దరి వాదన ఆగలేదు. ఎంత చెప్పినా వినకుండా, మెట్రోలో గొడవ పడ్డారు. పోలీసు సహా, చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు కూడా చూసేంతవరకూ చూశారు. చివరకు అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు ఈ సీన్‌ను ఫోన్ కెమెరాల్లో రికార్డ్ చేసి నెట్‌లో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.
అయితే ఇలాంటి ఘటనలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ మెట్రోలో మహిళల మధ్య సీటు కోసం జరిగిన ఘర్షణలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నింట్లో అయితే ఇద్దరూ ఒకరిపై ఒకరు పడి జుట్టు పట్టుకొని కొట్టుకునే స్టేజ్ కి కూడా వెళ్ళిపోయారు.
Also Read:Crime news: ఇదెక్కడి దారుణం.. పిల్లనిస్తామని పిలిచి.. కొట్టి చంపారు భయ్యా