/rtv/media/media_files/2025/05/06/3tNlghGmhcSKItsUe7It.jpg)
bank-loan
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సెంట్రల్ బ్యాంక్‌లో భారీ స్కాం బయటపడింది. చనిపోయిన వ్యక్తిపై రూ.4 కోట్ల రుణం తీసుకున్నారు ఇద్దరు కేటుగాళ్లు.అసలు వారసులు బ్యాంకుకి వెళ్లడంతో ఈ ఘరనా మోసం వెలుగులో వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం మండలం వేములదీవికి చెందిన అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తిరుమాని నాగరాజు, ఆయన సోదరుడు శ్రీనివాస్, తల్లి పద్మావతి, తండ్రి వడ్డీకాసులకు 19 ఎకరాల భూమిలో చెరువులున్నాయి.
Also read : Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి
Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!
వడ్డికాసులు పేరుపై నకిలీ డాక్యుమెంట్లు
అయితే నాలుగేళ్ల క్రితం అంటే 2020లో వడ్డీకాసులు మృతి చెందారు. సోమవారం నాగరాజు, శ్రీనివాస్ రుణం కోసం ఓ జాతీయ బ్యాంకుకు పొలం దస్తావేజులు తీసుకువెళ్లారు. అయితే 2024లో వడ్డికాసులు పేరుపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కూనపరెడ్డి ప్రసాద్, చంద్రశేఖర్ .. వేములదీవిలో 19 ఎకరాల రొయ్యల చెరువుపై రూ.4 కోట్ల రుణం తీసుకున్నట్లుగా తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ ప్రకాశంను చెరువు యజమానులు నిలదీయగా.. రూల్స్ ప్రకారమే రుణం మంజూరు చేశామని మేనేజర్ బదులిచ్చాడు. దీంతో ఐదు గంటలపాటు బ్యాంకులో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే
Also Read: 2025 Met Gala: ఇదే ఫస్ట్ టైమ్.. 'మెట్ గాలా' 2025 వేదికపై కియారా బేబీ బంప్ లుక్.. ఫొటోలు చూశారా?
andhra-pradesh | cheating-case | narsapuram | bank-loan | west-godavari | latest-telugu-news | andhra-pradesh-crime-reports | telugu crime news