/rtv/media/media_files/2025/05/05/AVvMXexlazBnysxwG2fU.jpg)
Miss World 2025 event schedule
Miss World 2025: 72nd మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం వహిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరగబోయే ఈ అంతర్జాతీయ కార్యక్రమానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 10 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో 120కి పైగా పోటీదారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సౌకర్యాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
/rtv/media/media_files/2025/05/05/bR89goUergNGEAIzjAtX.png)
పూర్తి షెడ్యూల్
- మే6 -7: 120 దేశాలకు పైగా పోటీదారులు హైదరాబాద్ చేరుకుంటారు.
- మే 10: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా మిస్ వరల్డ్ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. తెలంగాణ సాంప్రదాయ జానపద గిరిజన నృత్య ప్రదర్శనలతో ప్రపంచ అందగత్తెలు స్వాగతం పలకనున్నారు.
- మే 12 : మిస్ వరల్డ్ పోటీదారులు నాగార్జున సాగర్, బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.
- మే 13 - చార్మినార్, లాడ్ బజార్‌లో కల్చరల్ వాక్. తర్వాత చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్.
- మే 14 - వరంగల్‌లోని కాళోజీ కళా క్షేత్రంలోని విద్యార్థులు, సంఘాలతో మిస్ వరల్డ్ పోటీదారులు సమయం గడపనున్నారు. ఆ తరువాత రామప్ప ఆలయం పర్యటన చేస్తారు.
- మే 15 - యాదగిరిగుట్ట ఆలయ పర్యటన, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు చేనేత పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి పోచంపల్లి సందర్శనను షెడ్యూల్ చేశారు.
- మే 16 - AIG, యశోదా, అపోలో హాస్పిటళ్లకు కంటెస్టెంట్ల మెడికల్ టూర్.
- మే 17 - గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్స్ జరుగనుంది. ఆ తర్వాత తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారు. దీంతో పాటు ప్రపంచ సుందరులు ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్ సందర్శించనున్నారు.
- మే 18&19: తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ టూర్. ఆ తర్వాత ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం సందర్శన.
- మే 20-21: గ్రూప్ 1 కంటెస్టెంట్లు ఉప్పల్లో జరగబోయే ఏపీఎల్ చూడనుండగా.. గ్రూప్ 2 కంటెస్టెంట్లు శిల్పారామంలో ఆర్ట్ వర్క్‌షాప్ సందర్శించనున్నారు.
- మే 22-24: కంటెస్టెంట్ల ప్రతిభా ప్రదర్శన, హెడ్ టూ హెడ్ చాలెంజ్, ఫ్యాషన్ ఫినాలే
- మే 26: బ్రిటిష్ రెసిడెన్సీ & తాజ్ ఫలక్‌నుమాలో గాలా డిన్నర్. సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
- మే 31: హైటెక్స్ లో సెంటర్ లో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అండ్ మిస్ వరల్డ్ కిరీటం అందజేత
- జూన్ 2: తెలంగాణ ఏర్పాటు దినోత్సవ సందర్భంగా మిస్ వరల్డ్ విజేతలు గవర్నర్, సీఎంను రాజ్ భావన్ లో కలుస్తారు.
Miss World 2025 hyderabad | latest-news | telugu-news