Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి

పాకిస్తాన్ నుంచి సైబర్ దాడులు తెగ జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత రక్షణ సంస్థలపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఇండియన్ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, థింక్ ట్యాంక్ మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ ష్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల నుంచి డేటాలను తస్కరించారు. 

New Update
CV anand: రూ.712కోట్ల సైబర్‌ స్కామ్‌..ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

భారత రక్షణ సంస్థల నుంచి డేటాలను దొంగలిస్తున్నారు పాకిస్తాన్ హ్యాకర్లు. ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా చెబుతున్నారు కూడా. అంతేకాదు ఏఏ సంస్థల నుంచి డేటాలను హ్యాక్ చేశామన్నది కూడా చెప్పారు. ఇండియన్ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, థింక్ ట్యాంక్ మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ ష్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల నుంచి పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాకర్స్ గ్రూప్ డేటాలను దొంగలించింది. సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని, వారి లాగిన్ ఆధారాలతో సహా అన్నింటినీ హ్యాక్ చేశారు. హ్యాకర్ గ్రూప్ రక్షణ సంస్థల పీఎస్యూ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ జెండా,
అల్ ఖలీద్ ట్యాంక్ చిత్రాలతో డీఫేస్ చేసింది. 

దెబ్బ కొట్టడానికి దొంగ మార్గాలు..

భారత్ ను దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ అన్ని విధాలుగా ట్రై చేస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా భారత రక్షణ శాఖ సైట్లను లక్ష్యంగా చేసుకుని డేటాను హ్యాక్ చేసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కథనాలు జాతీయ మీడియాలో వచ్చాయి. ఈ దాడులను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇలాంటి దాడులను నివారించడానికి మరిన్ని భద్రతా చర్యలను పెంచుతున్నామని చెప్పారు. అయితే తమ వెబ్ సైట్ లో డేటాను పాక్ హ్యాక్ చేసినట్లు వార్తలను నోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఖండించింది. పాకిస్తాన్ హ్యాకర్లు తమ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం వెళ్ళలేదని చెప్పారు. 

 

today-latest-news-in-telugu | india | defence | websites | hacking | pakistan

Also Read: USA: ఆ జైలు మళ్ళీ ఓపెన్..ట్రంప్ సంచలన నిర్ణయం

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు