HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!

నాని 'హిట్ 3' బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 4 రోజుల్లోనే రూ .101 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగుతుండడంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

New Update

HIT 3 Collections: నేచురల్ స్టార్ నాని శైలేష్ కొలను కాంబోలో విడుదలైన హిట్3 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. తొలిరోజే రూ. 40 కోట్ల వసూళ్లతో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. నాలుగు రోజుల్లో 'హిట్ 3' ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ''సర్కార్స్ సెంచరీ'' అంటూ ట్వీట్ చేశారు.

 సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగుతుండడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. హాయ్ నాన్న, కోర్ట్, హిట్3 వరుస విజయాలతో ఫుల్ జోష్ ఉన్నారు నాని. నాని స్వయంగా ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, కోమలీ ప్రసాద్, సముద్రఖని, రావు రమేష్, రవీంద్ర విజయ్  తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

నెక్స్ట్ పారడైస్ 

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత 'పారడైస్' అంటూ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు నాని. ఇందులో ఇప్పటివరకు ట్రై చేయని ఓ భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా.. నాని మాస్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చాయి. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  

cinema-news | latest-news | hit 3 box office collections | nani | actor-nani

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు