2025 Met Gala: ఇదే ఫస్ట్ టైమ్.. 'మెట్ గాలా' 2025 వేదికపై కియారా బేబీ బంప్ లుక్.. ఫొటోలు చూశారా?

ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ ఈవెంట్ 'మెట్ గాలా' ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇండియన్ స్టార్ నటి కియారా అద్వానీ బేబీ బంప్ తో 'మెట్ గాలా 2025 ' బ్లూ కార్పెట్‌పై తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు.

New Update
2025 Met Gala_ kiara advani

2025 Met Gala: kiara advani

2025 Met Gala:  ఫ్యాషన్ ప్రపంచం ఉత్సాహంగా ఎదురుచూసే  'మెట్ గాలా' ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా నిలిచింది. భారతీయ నటి కియారా అద్వానీ బేబీ బంప్ తో మెట్ గాలా బ్లూ కార్పెట్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. బేబీ బంప్ తో  'మెట్ గాలా' వేదికపై అడుగుపెట్టిన తొలి నటిగా చరిత్ర సృష్టించింది కియారా. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

'Bravehearts' గౌరవ్ గుప్తా డిజైన్ 

ఈ ఈవెంట్ కోసం కియారా ధరించిన డ్రెస్ పేరు  'Bravehearts'. దీనిని భారతీయ ఫేమస్ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించారు. ఇది కేవలం ఒక డ్రెస్ మాత్రమే కాదు మదర్ హుడ్, సాంస్కృతిక విలువలు,  భావోద్వేగాల ప్రతీక. ఈ డ్రెస్ లోని బంగారు బ్లౌజ్ పాతకాలపు స్టైల్ ని ప్రతిభింభించేలా రూపొందించారు. అలాగే బంప్ పై  తల్లి,  బిడ్డ హృదయాలను కలిపే విధంగా ఒక  గొలుసు డిజైన్ చేశారు.  ఫ్యాషన్ లెజెండ్ అండ్రే లియోన్ టాలీకి అంకితమైన కేప్  తో డ్రెస్ ని అద్భుతంగా ఫినిష్ చేశారు. 

ఈ సందర్భంగా  కియారా మాట్లాడుతూ..  తల్లి కాబోతున్న ఈ సమయంలో, మెట్ గాలా వేదికపై అడుగుపెట్టడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఇది కేవలం లుక్ కాదు, ఒక సందేశం – తల్లితనాన్ని గౌరవించాలి, ప్రతి తల్లి ఒక మార్గదర్శి అని తెలిపింది.  తల్లితనాన్ని, స్త్రీ శక్తిని, భారతీయ కళను ప్రపంచానికి చూపించిన అరుదైన దృశ్యంగా దీనిని వర్ణిస్తున్నారు నెటిజన్లు.

Kiara Advani Met Gala 2025
Kiara Advani Met Gala 2025

 


కియారాతో పాటు, షారుక్ ఖాన్, దిల్జీత్ దోసాంఝ్, ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ కూడా మెట్ గాలా2025 లో పాల్గొన్నారు. వీరంతా భారతీయ స్టైల్‌ను గ్లోబల్ స్టేజ్‌పై గర్వంగా ప్రదర్శించారు.

Kiara Advani Met Gala 2025, Met Gala Telugu News, Kiara Pregnant Look, Bravehearts Gaurav Gupta, Kiara Advani Baby Bump, telugu-news | latest-news | kiara-advani 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు