Shilpa Shetty: 50 ఏళ్ళ వయసులో బాలీవుడ్ బ్యూటీ స్టన్నింగ్ ఫొటో షూట్ !
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో శిల్పా స్టన్నింగ్ లుక్స్ నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో శిల్పా స్టన్నింగ్ లుక్స్ నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
కమెడియన్ రాహుల్ రామకృష్ణ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాహుల్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్ మొదలు పెట్టానని.. ఆసక్తి గల నటీనటులు తమ షోరీల్స్, ఫొటోలను సంబంధింత మెయిల్ కి పంపించగలరని తెలిపాడు.
కాంతారా 2 చిత్రబృందంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కలభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. గురువారం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
'స్క్విడ్ గేమ్ సీజన్ 3' నుంచి ఫైనల్ గేమ్ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఇందులో సియోంగ్ గి-హున్ భయాలతో పోరాడుతూ, అత్యంత ప్రమాదకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కనిపించింది. ఫైనల్ గేమ్ ఎపిసోడ్ జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
'తగ్ లైఫ్' పోస్ట్ థియేట్రికల్ రైట్స్ విషయంలో మేకర్స్ కి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ముందుగా నెట్ ఫ్లిక్స్ రూ. 130 కోట్లకు డీల్ కుదుర్చుకోగా.. ఇప్పుడు అందులో 20-25% తగ్గించాలని ప్రతిపాదిస్తుందట. సినిమాకు ప్లాప్ టాక్ రావడమే దీనికి కారణమని సమాచారం.
మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్- బన్నీ కాంబోలో ఓ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ 'సూపర్ హీరో' కథగా రూపొందనున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్.
అక్షయ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన 'కేసరి చాప్టర్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జలియన్ వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించారు.
ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది.
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన నటించిన థగ్ లైఫ్ ను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది, అనధికారిక బ్యాన్పై స్పందన తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేసింది.