/rtv/media/media_files/2025/10/10/mahesh-babu-2025-10-10-11-03-45.jpg)
Mahesh Babu
Mahesh Babu: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) పుట్టినరోజు సందర్భంగా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు చేసిన ప్రత్యేక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come😍😍😍..Have a great one sir 🤗🤗🤗♥️♥️♥️ pic.twitter.com/U3tcyJIbgv
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2025
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
S S Rajamouli Birthday ..
మహేశ్ తన ట్వీట్‌లో, “Wishing the one and only @ssrajamouli a very Happy Birthday… The best is always yet to come. Have a great one sir.”
అని రాశారు. ఆయనతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోను కూడా షేర్ చేశారు.
ఈ “The best is always yet to come” అనే లైన్ చూసి SSMB29 సినిమా మీద ఉన్న అంచనాలు మళ్లీ రెట్టింపయ్యాయి. నవంబర్‌లో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని వార్త రావడంతో, అభిమానులు ఆనందంతో మునిగిపోతున్నారు.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
SSMB 29 టైటిల్‌పై గాసిప్స్..
ఇప్పటి వరకు ఈ సినిమాకు "Maharaj", "Globetrotter", "GEN63" లాంటి టైటిల్స్ చర్చలోకి వచ్చాయి. తాజాగా “వారణాసి” అనే పేరు హల్‌చల్ చేస్తోంది. ఇది ఒక ప్రదేశం పేరు అయినప్పటికీ, సినిమా గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని ముందే చెప్పారు కాబట్టి, ఈ టైటిల్ కాస్త ఆశ్చర్యంగా ఉంది.
అయితే గతంలో కూడా రాజమౌళి సినిమాల టైటిల్‌లపై ఇలానే ఊహాగానాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా టైటిల్స్ చివరకు వదిలేసినవి. కాబట్టి “వారణాసి” కూడా అలాగే ఒక వదంతి అయి ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇది నిజమేనా కాదా అనేది చూడాలి.
Also Read: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!
ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్కు పూర్తిగా మార్చేశారు. ఫిజికల్‌గా చాలా మార్పులు చేసుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం సిద్ధమవుతున్నారు. ఇదే ఆయన తొలి పాన్ వరల్డ్ సినిమా. అలాగే, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. సంగీతం బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
మొత్తానికి, మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్‌ను అధికారికంగా నవంబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే ఇది ఒక ప్రభంజనం సృష్టించే ప్రాజెక్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టైటిల్ విషయమై రాజమౌళి స్పందిస్తే తప్ప అసలు నిజం తెలుస్తుంది.