/rtv/media/media_files/2025/09/20/ram-charan-sukumar-2025-09-20-11-10-05.jpg)
Ram Charan - Sukumar
Ram Charan - Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా "పెద్ది" షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ప్రస్తుతం పుణేలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
"ఉప్పెన" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చి బాబు, ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి చేస్తున్న "పెద్ది" పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్ ఓ సంప్రదాయమైన పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
సుకుమార్ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో మొదలయ్యే చాన్స్..!
ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్రాజెక్ట్. ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ 2026 ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
అంతకంటే ముందు, "పెద్ది" సినిమా షూటింగ్ 2026 జనవరిలో పూర్తవుతుందని సమాచారం. ఆ సినిమా పూర్తయ్యాకే చరణ్, సుకుమార్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఈ ఇద్దరి కలయికకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత సినిమా "రంగస్థలం" ఎన్నో రికార్డులను బ్రేక్ చేసినట్లు గుర్తుండే ఉంటుంది. అది బాహుబలి తర్వాత ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ కాంబో రెండోసారి కలవబోతున్నారన్న వార్తపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!
సుకుమార్ గతంలో చరణ్ నుండి పూర్తిగా కొత్తదనం చూపించి, మాస్ ఇమేజ్‌తో పాటు నటనను కూడా బయటకి తీసుకొచ్చాడు. అలాంటి మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్..
ఈ సినిమాకి కూడా సంగీతం అందించబోతున్నది దేవి శ్రీ ప్రసాద్. "రంగస్థలం" లో పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో కూడాను సినిమాకు ప్రాణం పోశాడు. ఇప్పుడు మరోసారి అదే జట్టు కుదరడంతో, సంగీతం పరంగా కూడ సినిమాపై హైప్ ఉంది.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
మొత్తానికి ఇప్పుడు రామ్ చరణ్ అయితే పెద్ది షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దాదాపు 2026 ఫిబ్రవరిలో సుకుమార్ సినిమా ప్రారంభం కానుందని ఫిలింనగర్ టాక్. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ వస్తుండటంతో ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే!