/rtv/media/media_files/2025/10/09/baahubali-2025-10-09-13-50-54.jpg)
Baahubali
Baahubali:ఇటీవల కాలంలో సినిమాల టికెట్ ధరలు భారీగా పెరగడం ప్రేక్షకులకు తలనొప్పిగా మారింది. చిన్నా, పెద్దా సినిమాలన్నీ హై టికెట్ రేట్లతో విడుదల అవుతున్నాయి. దీనివల్ల మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడాలంటే ప్రేక్షకులపై అదనపు భారం పడుతోంది.
ఈ టికెట్ ధరల పెంపు ట్రెండ్‌కు మొదలు పెట్టింది రాజమౌళి సినిమాల నుంచే. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ ఉన్న ఆయన సినిమాలకి పెరిగిన టికెట్ ధరలు ప్రేక్షకులు అంగీకరించారు. అయితే, ఆ తర్వాత చాలామంది నిర్మాతలు అదే ట్రెండ్ ఫాలో కావడం మొదలుపెట్టారు. కానీ వాళ్ల సినిమాలు ఆ స్థాయి అనిపించకపోవడంతో, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Telusu Kada Trailer: స్టార్ బాయ్ సిద్ధు ‘తెలుసు కదా’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ టైం ఫిక్స్!
ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చిలో విడుదల కాబోతోంది. కానీ అంతకంటే ముందు, ఆయన మరో స్పెషల్ వెర్షన్‌ను తెస్తున్నారు. అదే బాహుబలి: ది ఎపిక్. ఇది ‘బాహుబలి – ది బిగినింగ్’, ‘బాహుబలి – ది కంక్లూజన్’ రెండింటినీ కలిపి తయారు చేసిన కొత్త ఎడిషన్. దీనిని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
ఈ కొత్త వెర్షన్‌లో పాత సీన్లు, కొన్ని కొత్త సీన్లు, రీ-ఎడిటెడ్ క్లైమాక్స్ వంటివి ఉండే అవకాశముంది. దీనిని అత్యాధునిక టెక్నాలజీతో మళ్లీ రీమాస్టర్ చేసి, IMAX, Dolby Cinema, 4DX, D-Box, EpiQ వంటి లార్జ్-స్క్రీన్ ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
Ticket Prices For Baahubali: The Epic
ఇలా గ్రాండ్ రిలీజ్ అవుతుండడంతో, మళ్లీ టికెట్ ధరలు పెరగుతాయని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈసారి ఎటువంటి టికెట్ రేట్ పెంపు ఉండదని స్పష్టం చేశారు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా రెగ్యులర్ రేట్లకే ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు సినిమాలకు ఎక్కువగా ఛార్జ్ చేసే దేశాల్లో కూడా ఇదే పాలసీ ఉండబోతోందట.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు. బాహుబలి: ది ఎపిక్ ఒక వన్-షాట్ సినిమాగా, పాత జ్ఞాపకాలను తిరిగి మళ్లీ తెరపై చూపనుంది - అది కూడా అధునాతన విజువల్ ఫార్మాట్లలో, కానీ సాధారణ టికెట్ ధరలతో! ఇంత గ్రాండ్ విజువల్ అనుభూతిని, రెగ్యులర్ ధరకే చూడటం అంటే ఇది ప్రేక్షకుల కోసం రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్ లాంటిదే అని చెప్పొచ్చు!