ARI Movie: ఒకటి కాదు.. రెండు కాదు.. నా ఏడేళ్ల కష్టం 'అరి' సినిమా.. కన్నీరు పెట్టిస్తున్న దర్శకుడి పోస్ట్!

ఓ దర్శకుడు తన సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేశాడు. కథను తయారు చేసుకోవడానికి హిమాలయాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు తిరిగాడు. వినూత్న కథాంశాన్ని తీసుకుని మూడేళ్ల పాటు కష్టపడి స్టోరీ రూపొందించుకున్నాడు. అదే 'అరి' సినిమా.

New Update
Ari Movie

దర్శకుడికి సినిమా అంటే చంటిబిడ్డతో సమానం. ఎప్పుడెప్పుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి? తన ఆలోచనలను స్క్రీన్ మీద చూపించి ప్రేక్షకుల మన్ననలు ఎలా పొందాలి? అని తపన పొందుతూ ఉంటాడు దర్శకుడు. ఓ దర్శకుడు తన సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేశాడు. కథను తయారు చేసుకోవడానికి హిమాలయాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు తిరిగాడు. అరి షడ్వర్గాల కాన్సెప్ట్‌పై లోతైన పట్టు సాధించాడు. ఇంతవరకు వెండితెరపైకి రాని ఒక వినూత్న కథాంశాన్ని తీసుకుని మూడేళ్ల పాటు కష్టపడి స్టోరీ రూపొందించుకున్నాడు. అదే 'అరి' సినిమా(ari-movie). దాని డైరెక్టర్ జయశంకర్.

Also Read :  బాహుబలి: ది ఎపిక్ టికెట్ రేట్ల హైక్ ఉంటుందా..?

Tollywood Director Jayashankar Ari Movie Will Release Tomorrow

మొత్తం నాలుగేళ్ల నిర్మాణ కష్టం, ఏడేళ్ల పరిశోధనతో ఈ 'అరి' మూవీని రూపొందించారు దర్శకుడు. ఈ సినిమా రేపు అంటే.. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అతను సాధించిన సుదీర్ఘ ప్రయాణంలో తన తండ్రి, బావను కూడా ఆయన కోల్పోయారు. వీరిద్దరు తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తులని ఆయన ఎమోషనల్ అయ్యారు. తన ప్రతీ ఫ్రేమ్ లోనూ వారి ఆశీస్సులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. తను రూపొందించి 'అరి' సినిమా ఇక రేపటి నుంచి ఆడియెన్స్ సొంతం అంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన సినిమాను తన జీవితంలో ఇద్దరు మూల స్తంభాలైన తన తండ్రి, బావకు అంకితం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.  

Also Read :  Rajamouli: SSMB29 టైటిల్‌ ‘వారణాసి’.. రాజమౌళి క్లారిటీ ఇస్తారా..?

Advertisment
తాజా కథనాలు