Salaar BGM: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!

Apple TV విడుదల చేసిన "The Lost Bus" ట్రైలర్‌లో వినిపించిన బీజీఎం, ప్రభాస్ నటించిన "సలార్" సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కాపీ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై హోంబలే ఫిలిమ్స్, రవి బస్రూర్ స్పందించాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు.

New Update
Salaar BGM

Salaar BGM

Salaar BGM: మన ఇండియన్ సినిమాలలో చాలా సార్లు హాలీవుడ్ సినిమాల మ్యూజిక్, బీజీఎంలు వినిపిస్తుంటాయి అన్న ఆరోపణలు మనం తరచూ వింటుంటాం. కానీ ఇప్పుడు అసలు పరిస్థితి తలక్రిందులైంది. హాలీవుడ్ లో వచ్చిన ఓ తాజా చిత్రం, మన తెలుగు సినిమా సలార్ నుంచి మ్యూజిక్ కాపీ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Also Read: బాహుబలి: ది ఎపిక్ టికెట్ రేట్ల హైక్ ఉంటుందా..?

Salaar BGM in Hollywood Movie ..

ఇంతకు విషయమేంటంటే, Apple TV తమ కొత్త సినిమా The Lost Bus కి సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ క్లిప్ లో 1 నిమిషం 13 సెకన్ల వద్ద వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ను గమనించిన కొంతమంది నెటిజన్లు, అది సలార్ సినిమాలో వినిపించిన బీజీఎంలనే ఉందని చెబుతున్నారు.

Also Read: స్టార్ బాయ్ సిద్ధు ‘తెలుసు కదా’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ టైం ఫిక్స్!

ఒకవైపు ఇది పూర్తిగా కాపీ చేసారనే వాదన ఉంటే, మరికొందరు మాత్రం రెండు ట్యూన్లు కొంతవరకూ సమానంగా అనిపిస్తున్నాయని కానీ పూర్తిగా ఒకేలా లేవని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆరోపణలతో పాటు, ప్రభాస్ అభిమానులు, మరికొంతమంది నెటిజన్లు సలార్ సంగీత దర్శకుడు రవి బస్రూర్, హోంబలే ఫిలిమ్స్ వెంటనే స్పందించి, Apple TV, The Lost Bus టీంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా ఈ వివాదంపై Apple TV కానీ, హోంబలే ఫిలిమ్స్ కానీ అధికారికంగా స్పందించలేదు. కానీ ఆ బీజీఎం కలిగిన క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చకు దారి తీస్తోంది.

Also Read: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

Paul Greengrass దర్శకత్వంలో రూపొందిన ఈ The Lost Bus సినిమాలో Matthew McConaughey, America Ferrera, Yul Vazquez, Ashlie Atkinson, Katie Wharton కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 3న Apple TVలో విడుదల అయ్యింది.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

దీనితో ఇండియన్ సినిమాల మ్యూజిక్ అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోతుందా? ఇప్పుడు భారత మ్యూజిక్ ని హాలీవుడ్ కాపీ చేస్తున్నాయా? సలార్ బీజీఎం నిజంగా కాపీ అయిందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఈ అంశం పట్ల సోషల్ మీడియాలో ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతుంది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ చర్చ ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది..

Advertisment
తాజా కథనాలు