Ustaad Bhagat Singh: టార్గెట్ సమ్మర్ 2026..? 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ చివరి దశలో ఉంది. ఆయన భాగం పూర్తి కాగా, ఇంకా 20-25 రోజులు చిత్రీకరణ మిగిలి ఉంది. నిర్మాతలు ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదు. 2026 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులకు ప్రస్తుతం ఆనందం వేరే లెవెల్లో ఉంది. ఆయన నటించిన తాజా గ్యాంగ్‌స్టర్ డ్రామా "They Call Him OG" మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి భారీ చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్ (UBS)" మీదే పడింది.

"ఉస్తాద్ భగత్ సింగ్" 2026 మహాశివరాత్రి సందర్భంగా విడుదల కానుందని గట్టి ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ వార్తలపై నిర్మాత రవి కుమార్ స్పందిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు.

Also Read: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!

Ustaad Bhagat Singh Release Date .. 

"పవన్ కళ్యాణ్ గారు తన భాగం షూటింగ్ పూర్తిచేశారు. దర్శకుడు హరీష్ శంకర్ గారు రేపటినుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెడుతున్నారు. ఇంకా 20 నుంచి 25 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. తర్వాతే చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. రిలీజ్ డేట్‌ను శ్రద్ధగా పరిశీలించి, ప్రేక్షకులకు బాగా నచ్చే సమయాన్ని ఎంచుకుంటాం," అని రవి కుమార్ చెప్పారు.

Also Read: బాహుబలి: ది ఎపిక్ టికెట్ రేట్ల హైక్ ఉంటుందా..?

అంటే ఇప్పటివరకు విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీనితో, ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు కొంత సమయం ఆగాల్సి ఉంటుంది.

ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరూ తెలుగులో పెద్ద క్రేజ్ ఉన్న హీరోయిన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాకి సంగీత దర్శకుడు గా దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తున్నారు. హరీష్ శంకర్ - దేవి శ్రీ ప్రసాద్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ అన్న విషయం తెలిసిందే.

Also Read: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

ఈ చిత్రం హై బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర స్టైల్, పవర్, మాస్ యాంగిల్ అన్నింటినీ కలగలిపినట్టుగా ఉండనుందని తెలుస్తోంది. అయితే, తాజాగా పవన్ నటించిన OG సూపర్ హిట్ తర్వాత UBS పై అంచనాలు మరింత పెరిగాయి.

సమ్మర్ 2026 టార్గెట్

ఇప్పుడు మూవీ టీం ఎప్పటికైనా సరైన సమయాన్ని చూసి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. సమాచారం ప్రకారం, ఈ సినిమా 2026 సమ్మర్ లో థియేటర్లలో రావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ఏ తేదీ ప్రకటించలేదు.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

మొత్తానికి, "ఉస్తాద్ భగత్ సింగ్" పై భారీ అంచనాలున్నాయి. OG విజయంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. తాజాగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం, షూటింగ్ తుది దశలో ఉంది. 

Advertisment
తాజా కథనాలు