/rtv/media/media_files/2025/09/20/deepika-padukone-2025-09-20-09-22-24.jpg)
Deepika Padukone
Deepika Padukone: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం సినిమా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న Spirit (దర్శకుడు సందీప్ రెడ్డి వంగా), భారీ విజయం సాధించిన Kalki 2898 AD సీక్వెల్ నుంచి ఆమె తప్పుకోవడం గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఇప్పటివరకు దీపికా ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంలో తన అభిప్రాయం తెలిపారు.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
ఎందుకు తప్పుకున్నారు..?
దీపికా మాట్లాడుతూ, "నేను పేర్లు చెప్పను కానీ, చాలా కాలంగా పురుష నటులు 8 గంటలు పని చేసి, వీకెండ్స్‌ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. ఇప్పుడు చాలామంది మహిళలు, కొత్త తల్లులు కూడా అదే విధంగా పని చేస్తున్నారు. కానీ, ఇది వార్తల్లోకి రావడం లేదు." అని పేర్కొన్నారు.
తన కెరీర్ మొత్తం ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నానని, నిశ్శబ్దంగా వాటిని ఎదుర్కొన్నానని తెలిపారు. “జీతం విషయంలోనూ నన్ను తగ్గించే పరిస్థితులు వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ అలా వెళ్లిపోలేదు. శాంతిగా, గౌరవంగా నా పోరాటం చేశాను.” అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
Spirit & Kalki నుంచి ఔట్
ప్రభాస్ హీరోగా వస్తున్న Spirit సినిమాలో మొదట దీపికా ఎంపికయ్యారు. అయితే ఆమె పని వేళలపై ఉన్న అభిప్రాయాల వల్ల ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రికి అవకాశం లభించింది. అదే విధంగా Kalki 2898 AD సీక్వెల్‌లోనూ ఆమెను కొనసాగించరన్న నిర్ణయాన్ని మేకర్స్ ఇటీవల వెల్లడించారు. దీనికి “కమిట్‌మెంట్ ఇష్యూస్”నే కారణంగా పేర్కొన్నారు.
Also Read: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!
వాస్తవానికి దీపికా మొదటి భాగంలో ముఖ్య పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆమె పాత్ర కొనసాగుతుందని అంతా భావించగా, ఈ నిర్ణయం కొంత మందిని ఆశ్చర్యంలోకి నెట్టింది.
ప్రస్తుతం దీపికా, షారుక్ ఖాన్‌తో కలిసి King అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది.
మొత్తానికి, Spirit, Kalki సినిమాల నుంచి తప్పుకోవడం వెనుక దీపికా వ్యక్తిగత అభిప్రాయాలే ప్రధాన కారణమని ఆమె తాజాగా వెల్లడించారు. పని గంటలపై ఆమెకు ఉన్న అభిప్రాయం, పని పద్ధతులు ఇవన్నీ పరిశ్రమలో ఒక చర్చకు దారి తీసేలా ఉన్నాయి.