Lokah: మలయాళ సినీ చరిత్రలో రికార్డు.. తొలి ₹300 కోట్ల చిత్రంగా 'కొత్త లోక'!

'లోకా: ఛాప్టర్ వన్ - చంద్ర' చిత్రం మలయాళంలో తొలి ₹300 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. మహిళా సూపర్ హీరో కథతో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, చిన్న బడ్జెట్‌తో రూపొంది భారీ విజయాన్ని సాధించింది. ఇది ఐదు భాగాల సిరీస్‌లో మొదటి భాగం.

New Update
Lokah

Lokah

Lokah: ఇటీవలి కాలంలో మలయాళ సినిమా రంగం భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందుతోంది. కొత్త తరహా కథలు, రియలిస్టిక్ గా తీసిన చిత్రాలు, బడ్జెట్ కంటే కథకు ప్రాధాన్యత ఇచ్చే దర్శకత్వం వల్ల మలయాళ సినిమాలు ఎప్పటికప్పుడు పెద్ద విజయాలు అందుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ విజయయాత్రను మరో స్థాయికి తీసుకెళ్లింది ‘లోకా: ఛాప్టర్ వన్ - చంద్ర’ అనే చిత్రం. ఈ సినిమా మలయాళ పరిశ్రమలోనే తొలిసారి ₹300 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా గా నిలిచింది. ఇది మలయాళ సినిమా చరిత్రలో మైలురాయి వంటి ఘనత అని చెప్పొచ్చు.

Also Read: బాహుబలి: ది ఎపిక్ టికెట్ రేట్ల హైక్ ఉంటుందా..?

సినిమా వివరాలు..

ఈ చిత్రానికి(Kotha Lokah) డైరెక్టర్ డొమినిక్ అరుణ్, నిర్మాతగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ వ్యవహరించాడు. సినిమా బడ్జెట్(Kotha Lokah Budget) సుమారుగా ₹30 కోట్ల వరకు ఉంది. అయితే విడుదలైన తర్వాత ఆరు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా వసూళ్లు(Kotha Lokah Collections) సాధించింది. 

Also Read:స్టార్ బాయ్ సిద్ధు ‘తెలుసు కదా’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ టైం ఫిక్స్!

ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది మహిళా ప్రాధాన్యత గల చిత్రం. కథను ముందుకు నడిపించే ప్రధాన పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. ఆమె పోషించిన పాత్ర ఒక సూపర్ హీరో పాత్ర. ఇది మలయాళ సినిమాల్లో తొలిసారిగా మహిళా సూపర్ హీరోగా రూపొందిన చిత్రం. ఆమెతో పాటు నాస్లెన్, చాందు సలీంకుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. వారి పాత్రలకు కూడా కథలో మంచి ప్రాధాన్యత ఉంది.

Also Read: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

మొత్తం 5 పార్ట్స్..

‘లోకా: ఛాప్టర్ వన్ - చంద్ర’ అనేది మొత్తం ఐదు భాగాల సిరీస్‌లో మొదటి భాగం మాత్రమే. ఈ సినిమా విజయంతో, మిగతా నాలుగు భాగాల మీద కూడా ప్రేక్షకులలో భారీ ఆసక్తి ఏర్పడింది. ఈ సిరీస్ తో మలయాళ పరిశ్రమలో మరో సూపర్ హీరో యూనివర్స్ పుట్టనుంది.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్

మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా ఆడింది. 2018, మంజుమ్మేల్ బాయ్స్ సినిమాల తరహాలో, లోకా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. మలయాళ సినిమాలు ఇతర భాషల్లో కూడా ఎంతో ఆదరణ పొందుతున్నాయి.

లోకా సినిమా సాధించిన ఈ ఘనత మలయాళ సినిమాకే కాదు, భారతీయ సినిమాకూ గర్వకారణం. చిన్న బడ్జెట్‌తో పెద్ద స్కేల్ లో రూపొందిన ఈ సినిమా, మంచి కథ చెప్పగలిగితే ప్రేక్షకులు ఎక్కడ నుంచైనా ఆదరిస్తారనే నిజాన్ని మరోసారి రుజువు చేసింది.

Advertisment
తాజా కథనాలు