Casting Couch : దుల్కర్ సల్మాన్ కు బిగ్ షాక్.. రూమ్ కు రమ్మన్నాడంటూ యువతి ఫిర్యాదు

దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీపై ఒక మహిళ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణ చేసింది. అసోసియేట్ డైరెక్టర్ దినాల్ బాబు తనను లేంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. అయితే వేఫేరర్ ఫిల్మ్స్ ఆ డైరెక్టర్‌తో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

New Update
woman complaint against dulquer salmaan production company alleges casting couch

woman complaint against dulquer salmaan production company alleges casting couch

ప్రముఖ మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్(dulkar-salman) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మలయాళీ ఫ్యాన్స్ తో పాటు తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా దూసుకుపోతున్నాడు. అతడికి సొంత బ్యానర్ కూడా ఉంది. దుల్కర్ కు వేఫేరర్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి బిగ్ షాక్ తగిలింది. ఓ యువతి కాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడిది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

Also Read :  నాలుగు పదుల వయసులోనూ ఏ మాత్రం తగ్గని గ్లామర్.. పింక్ డ్రెస్ లో సీనియర్ బ్యూటీ హాట్ షో!

దుల్కర్ కు బిగ్ షాక్

అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు వేఫేరర్ ఫిలిమ్స్ పేరుతో తనను వేధించాడని.. తాను కాస్టింగ్ కౌచ్‌(casting-couch)కు గురైనట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి దినిల్ బాబు తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని యువతి ఆరోపించింది. వేఫేరర్ ఫిలిమ్స్ తరఫున సినిమాలో నటించేందుకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి.. రూమ్ కు రమ్మని తనను అవమానించాడని తెలిపింది. వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మించే కొత్త సినిమా ప్రారంభమవుతోందని, అందులో నటించే విషయం మాట్లాడటానికి నేరుగా కలవాలని దినిల్ బాబు తనను పిలిచారని యువతి తెలిపింది. 

పనమ్పిల్లి నగర్‌లోని వేఫేరర్ కార్యాలయం సమీపంలోని ఒక భవనంలోకి రమ్మని అతను కోరాడని యువతి వెల్లడించింది. తాను అక్కడికి వెళ్లినప్పుడు దినిల్ బాబు ఒక గదిలోకి తీసుకెళ్లి తనను లైంగికంగా వేధించడానికి(sexual-assault) ప్రయత్నించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనతో సహకరించకపోతే మలయాళ చిత్రాలలో అవకాశాలు లభించవని దినిల్ బాబు బెదిరించాడని యువతి ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదుతో పాటు దినిల్ బాబు వాయిస్ మెసేజ్‌లను కూడా బహిరంగపరిచింది. 

యువతి ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో దినిల్ బాబుపై వేఫేరర్ ఫిలిమ్స్ సంస్థ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా ఈ ఫిర్యాదుపై వేఫేరర్ ఫిలిమ్స్ స్పందించింది. దినిల్ బాబుపై తేవర పోలీస్ స్టేషన్‌లో, అలాగే ఫెఫ్కా (FEFKA) కు ఫిర్యాదు చేసింది. దినిల్ బాబుకు తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని, వేఫేరర్ నిర్మించిన ఏ చిత్రంలోనూ అతను భాగం కాలేదని సంస్థ స్పష్టం చేసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేఫేరర్ ఫిలిమ్స్‌కు చెడ్డపేరు తెచ్చినందుకు గాను దినిల్ బాబుపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. దుల్కర్ సల్మాన్ లేదా వేఫేరర్ ఫిలిమ్స్ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే తమ కాస్టింగ్ కాల్స్ వస్తాయని.. ఇతర నకిలీ కాస్టింగ్ కాల్స్‌తో మోసపోవద్దని వేఫేరర్ ఫిలిమ్స్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

Also Read :  ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్!

Advertisment
తాజా కథనాలు