/rtv/media/media_files/2025/10/15/bigg-boss-elimination-2025-10-15-19-27-15.jpg)
bigg boss elimination
Bigg Boss 9 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే పూర్తవగా.. భరణి, తనూజ, దివ్య, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డెమోన్ పవన్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓటింగ్ పోల్స్ ప్రకారం.. తనూజ, భరణి భారీ ఓటింగ్ తో అందరి కంటే ముందుగా ఉన్నారు. ఆ తర్వాత డెమోన్ పవన్ కి మంచి ఓటింగ్ పడుతోంది. ఈ వారం రీతూ కూడా నామినేషన్స్ లో లేకపోవడంతో పవన్ కి కలిసొచ్చింది. రీతూ ఓట్లు కూడా అతడికే పడుతుండడంతో సేఫ్ జోన్లో ఉన్నాడు.
Also Read : నాలుగు పదుల వయసులోనూ ఏ మాత్రం తగ్గని గ్లామర్.. పింక్ డ్రెస్ లో సీనియర్ బ్యూటీ హాట్ షో!
ఆ ముగ్గురు డేంజర్ జోన్..
ఇక రాము రాథోడ్, దివ్య, సుమన్ శెట్టి ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళ ముగ్గురిలో ఒకరు ఈవారం బయటకు వెళ్లనున్నట్లు టాక్. ఇందులో దివ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'అగ్నిపరీక్ష' షో నుంచి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్య.. వచ్చిన మొదటి రెండు వారాలు టాస్కులు, తన మాట తీరుతో బాగానే ఆకట్టుకుంది. కానీ, షో మొదలైన రెండు వారల తర్వాత రావడంతో ఆమెకు పెద్దగా ఓట్ బ్యాక్ క్రియేట్ అవ్వలేదు. సో దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
రాము రాథోడ్
అయితే ఊహించని విధంగా రాము రాథోడ్ కి లీస్ట్ ఓటింగ్ పడుతున్నట్లు తెలుస్తోంది. పోయిన కెప్టెన్ గా, సంచాలకుడిగా ఇరగదీశాడు రాము. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మనోడి స్క్రీన్ స్పేస్ బాగా తగ్గిపోయింది. ఇక సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ పెద్దగా లేకపోయినా.. అతడికి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా గట్టిగానే ఓట్లు పడుతున్నాయి. దీంతో రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: CINEMA: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న 'పాయిజన్ బేబీ' స్.. ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్!