/rtv/media/media_files/2025/10/06/tamanna-2025-10-06-19-27-32.jpg)
Tamanna
Tamannaah Viral Video: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో అదరగొడుతోంది. ఇటీవలే 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సీరీస్ లో 'గఫూర్' స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇందులో తమన్నా గ్లామర్, డాన్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇందులో తమన్నా బ్యాక్ సైడ్ తిరిగి హిప్ మూమెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమన్నా ఏంటి పబ్లిక్ లో ఇలా చేస్తున్నారు అంటూ షాకవుతున్నారు.
ఏఐ వీడియో
అయితే ఇది పూర్తిగా ఏఐ ఆధారంగా సృష్టించబడిన వీడియో అని తెలుస్తోంది. తమన్నా విజువల్స్ మార్ఫింగ్ చేసి ఈ వీడియో క్రియేట్ చేశారు. దీంతో ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసేవారిపై ఆమె అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ''సెలబ్రెటీలు అయినంత మాత్రానా.. వాళ్ళ ఫొటోలు, వీడియోలు విచ్చలవిడిగా వాడుకునే అధికారం ఎవరికీ లేదు.. వారి ప్రైవెసీని కూడా గౌరవించాలి'' అంటూ గడ్డి పెడుతున్నారు. ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు డీప్ ఫేక్, ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం బారిన పడుతున్నారు. అనుమతి లేకుండా సోషల్ మీడియాలో, పలు వాణిజ్య ప్రకటనల్లో తన పేరు, ఫొటోలను వాడుకుంటున్నారని న్యాయస్థానాన్ని ఆశయిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, టాలీవుడ్ హీరో నాగార్జున ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన గోప్యతా హక్కులను కాపాడాలని న్యాయస్థానాన్ని కోరారు.
Also Read: Bigg Boss Promo: రేలంగి మావయ్య బయటకొచ్చాడు.. భరణికి ఇచ్చి పడేసిన శ్రీజ..! హై వోల్టేజ్ ఎపిసోడ్