Vaishnavi Chaitanya: ‘బేబి’ నోట బూతు మాట.. ఛీ ఛీ అందరి ముందు అలా అనేసిందేంటి బ్రో?

భీమవరంలో జరిగిన ‘జాక్’ మూవీ ఈవెంట్లో వైష్ణవి చైతన్య నోట బూతు మాట వినిపించింది. భీమవరం అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది. పక్కనే ఉన్న సిద్ధూ ఇది భీమవరం అని చెప్పి వెళ్లిన తర్వాత.. హో F**k అని అనేసింది. మైక్ ఆన్‌లోనే ఉండటంతో అంతా షాకైపోయారు.

New Update
Vaishnavi Chaitanya Forgot Bhimavaram Name And Calls It Rajahmundry In Jack Movie event

Vaishnavi Chaitanya Forgot Bhimavaram Name And Calls It Rajahmundry In Jack Movie event

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య కలిసి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘జాక్’. ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే హీరో, హీరోయిన్ కలిసి పలు ఫేమస్ జిల్లాల్లో సందడి చేస్తున్నారు. రీసెంట్‌గా భీమవరంలో హోరెత్తించారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ప్రమోషన్లలో భాగంగానే విష్ణు కాలేజీలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో హీరో సిద్ధూ, హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు మూవీ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో ‘బేబీ’ బ్యూటీ వైష్ణవి చైతన్య ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్టేజ్‌పై వైష్ణవి మాట్లాడుతూ.. స్టూడెంట్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు తెలిపారు. అలాగే తనపై స్టూడెంట్స్ చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

Also Read :  ఏమైంది.. ఉరేసుకొని వివాహిత, యువతి ఆత్మహత్య!

బేబి నోట బూతు మాట

వారి ప్రేమ, ఎనర్జీ గురించి పొగిడేసింది. అదే ఊపులో ఈ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది భీమవరంలో అనేది మర్చిపోయి.. రాజమండ్రి అని అనేసింది. దీంతో స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా అరవడం మొదలెట్టారు. అదే సమయంలో స్టేజ్‌పైనే ఉన్న హీరో సిద్ధూ.. వైష్ణవి వద్దకు వచ్చి ఇది భీమవరం అని చెప్పి వెళ్లాడు. అలా సిద్ధూ చెప్పిన తర్వాత వైష్ణవి ఒక్కసారి హో F**k అని అనేసింది. అది కూడా మైక్‌ ఆఫ్ చేయకుండా అనేయడంతో అందరికీ వినిపించేసింది. చివరకు ఎలాగోలా కవర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

(telugu-news | latest-telugu-news | Jack Movie | siddu-jonnalagadda | vaishnavi-chaitanya | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | viral news telugu)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు