/rtv/media/media_files/2026/02/03/grammy-awards-2026-2026-02-03-12-42-01.jpg)
Grammy Awards 2026
Grammy Awards 2026: ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గ్రామీ అవార్డ్స్ 2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేదికపై కళాకారులు తమ సంగీత ప్రతిభతో పాటు ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ ఏడాది గ్రామీ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ విషయంలో ఎక్కువగా చర్చకు వచ్చిన పేరు అమెరికన్ సింగర్ చాపెల్ రోన్.
గ్రామీ అవార్డ్స్ 2026 వేడుకల్లో చాపెల్ రోన్ ధరించిన డ్రెస్సింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె దాదాపు టాప్‌లెస్‌గా కనిపించేలా ఉన్న ట్రాన్స్పరెంట్ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఈ డ్రెస్‌కు బాడీ ఆర్ట్‌ను జోడించి, చాలా ధైర్యంగా తన లుక్‌ను ప్రదర్శించారు. ఈ లుక్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Click the link for the most daring, skin-forward look to walk the #Grammys2026 red carpet https://t.co/zqyvtIJ1QDpic.twitter.com/RwlF9NJXYS
— InStyle (@InStyle) February 2, 2026
చాపెల్ రోన్ ధరించిన ఈ డ్రెస్ గ్రామీ అవార్డ్స్ చరిత్రలోనే అత్యంత బోల్డ్ లుక్స్‌లో ఒకటిగా నిలిచింది. గతంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రత్యేకమైన దుస్తులతో కనిపించినా, చాపెల్ రోన్ ఎంచుకున్న ఈ షీర్ డ్రెస్, బాడీ ఆర్ట్ కలయిక మాత్రం కొత్తగా ఉందని అంటున్నారు.
ఈ గ్రామీ అవార్డ్స్ వేడుకల్లో చాపెల్ రోన్‌తో పాటు ప్రముఖ గాయకులు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. లేడీ గాగా ప్రత్యేకమైన “కేజ్‌డ్ బర్డ్” స్టైల్ డ్రెస్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. సబ్రినా కార్పెంటర్, రోజ్, బిల్లీ ఐలిష్ కూడా తమ తమ స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అలరించారు.
బిల్లీ ఐలిష్ ఈ ఏడాది నలుపు-తెలుపు కాంబోలో రూపొందించిన ప్రత్యేక డ్రెస్‌లో చాలా సింపుల్‌గా కనిపించారు. ఆమె ఈ వేడుకల్లో సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
ఇక మైలీ సైరస్, రాక్ అండ్ రోల్ స్టైల్‌లో నలుపు లెదర్ జాకెట్‌తో ప్రత్యేకమైన లుక్‌లో కనిపించారు. ఆమె గతంలో ‘ఫ్లవర్స్’ పాటకు గ్రామీ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే.
మొత్తంగా గ్రామీ అవార్డ్స్ 2026 వేడుకలు సంగీతం మాత్రమే కాదు, ఫ్యాషన్ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చాపెల్ రోన్ బోల్డ్ లుక్ ఈసారి గ్రామీ రెడ్ కార్పెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us