Trisha : ఇద్దరి మధ్య ఏం లేనప్పుడు ఆ సిగ్గెందుకమ్మా!.. త్రిష వీడియో వైరల్!

40 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. స్టార్ హీరోయిన్ల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.

New Update
trisha

40 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష(trisha). స్టార్ హీరోయిన్ల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తుంది. దీంతో పాటుగా తమిళ్ లోనూఈ అమ్ముడు బిజీగా ఉంది. అయితే తాజాగా స్టార్ హీరో విజయ్ పై త్రిష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

హీరో విజయ్(TVK President Vijay), త్రిష రిలేషన్ షిప్ గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఇద్దరూ కలిసి వెకేషన్స్, టూర్స్ అంటూ ఎక్కడో ఒకచోట కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలు వచ్చాయి. తమ మధ్య అలాంటిది ఏమీ లేదని ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.  తాజాగా సైమా అవార్డ్స్(SIIMA Awards 2025) లో త్రిష.. విజయ్ గురించి మాట్లాడిన మాటాలు వైరల్ గా మారి వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి.  

Also Read :  వామ్మో! మల్లెపూలు తీసుకెళ్ళినందుకు.. నటికి రూ. 1.14 లక్షల జరిమానా !

విజయ్ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు

ఇక ఈ ఈవెంట్ లో త్రిష  మాట్లాడుతూ.. విజయ్ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. అతని కల ఏదైనా అది నిజమవుతుంది ఎందుకంటే అతను దానికి అర్హుడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం త్రిష చేసిన వ్యాఖ్యలు, ఆమె అలా సిగ్గుపడడం పై అభిమానులు మరోసారి విజయ్ తో పెళ్లి వార్తలు బయటకు తీశారు. అతనితో ఏమి లేనప్పుడు పేరు చెప్పగానే అంతా సిగ్గు పడడం దేనికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Also read :  Vice-President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక..  NDA, INDIA కూటముల బలం ఎంత?

కాగా  విజయ్ 'తమిళగ వెట్రి కజగం (TVK)' పార్టీని స్థాపించిన తర్వాత, రాజకీయాల్లోకి వస్తున్నందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు.  విజయ్ రాజకీయాల్లోకి రావడంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విజయ్ రాజకీయ అరంగేట్రంపై అడిగినప్పుడు, కమల్ హాసన్ మాట్లాడుతూ..   "విజయ్ రాజకీయాల్లోకి రావాలని నేను చాలా కాలంగా ప్రోత్సహిస్తున్నాను. నేను ప్రోత్సహించిన వారిలో నేను ముందుంటాను" అని అన్నారు. అంతేకాకుండా, ఒక రంగంలో కొనసాగాలంటే మరో రంగాన్ని వదిలేయాల్సిన అవసరం లేదని, తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. 

Also Read :  పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 115 మంది మ్యూజిషియన్స్ తో 'ఓజీ'  BGM!

Advertisment
తాజా కథనాలు