OG MOVIE: పవన్ కళ్యాణ్ ఓజీ పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'ఓజీ' మ్యూజికల్ విశేషాలకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ పంచుకున్నారు. ఈ సినిమా బీజీఎం కోసం జపాన్ వాయిద్య పరికరం కోటాను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లండలోని లోని స్టూడియోలో దీనికి సంబంధించిన రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని తెలిపారు.
117 మంది మ్యూజిషియన్స్
మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ఈ బీజేఎం కోసం ఏకంగా 117 మంది సంగీత కళాకారులు వర్క్ చేస్తున్నట్లు తమన్ చెప్పారు. ఈ విషయాన్ని తమన్ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీంతో పవన్ ఫ్యాన్ లో ఉత్సాహం మరింత పెరిగింది.
#HungryCheetah 🐆 Was Sounding So Gigantic 🖤
— thaman S (@MusicThaman) September 8, 2025
From @AbbeyRoad With 117 Futuristic Musicians 🥹#OgBGM ❤️ pic.twitter.com/06ffXhNekY
ఇప్పటికే ' ఓజీ ' నుంచి విడుదలైన రెండు పాటలు #HungryCheetah, సువ్వి.. సువ్వి సాంగ్స్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి . #HungryCheetah సాంగ్ లో తమన్ పవర్ ఫుల్ బీట్స్, ఎనర్జిటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచావ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
యాక్షన్ గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో పవన్ జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించగా.. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హరిహర వీరమల్లు డిజాస్టర్ తర్వాత పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ 'ఓజీ' పైనే పెట్టుకున్నారు. ప్రభాస్ సాహో డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
భారీ డిమాండ్
విడుదలకు ముందే ఓజీ రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ. 46 కోట్లకు ఓజీ నైజం హక్కులు సొంతం చేసుకున్నారు. నైజాం హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడవడం ఇదే మొదటిసారని టాక్. సినిమా పై ఉన్న భారీ అంచనాల కారణంగా డిస్టిబ్యూటర్లు హక్కుల కోసం పోటీ పడుతున్నారని సమాచారం. మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓజీ థియేట్రికల్ హక్కులు దాదాపు రూ. 169 కోట్లకు అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో టాక్.
Also Read: BIGG BOSS 9 TELUGU: బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆర్మీ మ్యాన్ .. ఫస్ట్ కామనర్ గా బిగ్ బాస్ లోకి!