/rtv/media/media_files/2025/09/08/navya-nair-2025-09-08-13-51-12.jpg)
navya nair
Navya Nair: మల్లెపూలు తీసుకెళ్ళినందుకు రూ. 1.1 లక్ష జరిమాన విధించారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు! అవునండీ ఇది నిజంగానే జరిగింది. ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్లిన మలయాళ నటి నవ్య నాయర్ తన బ్యాగ్ లో క్యారీ చేసినందుకు మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రూ. 1.14 లక్షల జరిమానా విధించింది. అయితే భారతదేశంలో మహిళలు జడలో మల్లెపూలు పెట్టుకోవడం, ఏదైనా శుభకార్యల కోసం తీసుకెళ్లడం ఒక సాధారణ విషయం. కానీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అనుమతి లేకుండా మల్లెపూలు తీసుకెళ్లడం చట్టరిత్యా నేరంగా పరిగణిస్తారు.
అసలేం జరిగింది..?
విక్టోరియాలోని మలయాళ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్లారు. 'ఓనం' వేడుకలు వెళ్తుండడంతో నవ్య తన బ్యాగులో 15 సెం.మీ పొడవు మల్లెపూల దండ తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న తర్వాత.. సెక్యూరిటీ చెక్ లో భాగంగా ఆమె బ్యాగ్ లో మల్లెపూలను గుర్తించారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. దీంతో విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో.. నవ్యకు జరిమానా విధించారు. అయితే ప్రపంచంలో అత్యంత బయో సెక్యూరిటీ ఉన్న విమానాశ్రయాల్లో ఆస్ట్రేలియాలోని మెల్ మెల్‌బోర్న్ ఎయిర్ పోర్ట్ ఒకటి. మొక్కలు, పూలు, పండ్లు, విత్తనాలు లేదా ఇతర జీవ సంబంధిత వస్తువులను అనుమతి లేకుండా తీసుకురావడం నిషేధం ఆ దేశంలోకి తీసుకురావడం నిషేధం. వీటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ సంభవించే ప్రమాదం ఉంటుందని ఈ నిబంధన పెట్టారు. కానీ, నటి నవ్య నాయర్ ఈ నిబంధనను ఉల్లంగిస్తూ.. అనుమతి లేకుండా మల్లెపూలను తీసుకురావడంతో కస్టమ్స్ అధికారులు రూ. 1.14 లక్షలు జరిమానా విధించారు.
తప్పు తప్పే..
జరిమానా విధించినప్పటికీ, నవ్య ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లోనే నవ్య ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. నవ్య మాట్లాడుతూ.. నేను ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు మా నాన్న నాకు మల్లెపూలు ఇచ్చారు. వాటిని రెండు భాగాలుగా చేసి, కొచ్చి నుంచి సింగపూర్ వరకు కొన్ని పూలు పెట్టుకోమని.. ఆ తర్వాత సింగపూర్ నుంచి మెల్‌బోర్న్‌కు ప్రయాణించేటప్పుడు పెట్టుకోవడానికి మిగతా పూలను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోమన్నారు. కానీ, ఇది అక్కడి చట్టాలకు వ్యతిరేకమని నాకు తెలియదు. ఇది నాకు తెలిసి జరిగిన తప్పు కాదు. అయినప్పటికీ తప్పు తప్పే. 15 సెం.మీ మల్లెపూలకు అధికారులు రూ. 1.14 లక్షల జరిమానా విధించారు. మరో 28 రోజుల్లో ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించారు అంటూ నవ్య తనకు ఎదురైన సంఘటన గురించి వివరించారు.
నవ్య నాయర్ మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. 'నందనం', 'కళ్యాణరామన్' వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు నవ్య రెండు సార్లు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు.
Also Read: CINEMA: అలియా వర్సెస్ దీపికా పదుకొణె.. నెట్టింట రచ్చ లేపుతున్న ఫ్యాన్ వార్!