/rtv/media/media_files/2025/09/08/election-2025-09-08-16-13-07.jpg)
భారత ఉపరాష్ట్రపతి పదవికి రేపు ఎన్నిక జరగనుంది. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్(Jagadeep Dhankhar) ఆరోగ్య కారణాల వల్ల ఆకస్మికంగా రాజీనామా చేసిన దాదాపు రెండు నెలల తర్వాత, సెప్టెంబర్ 9, మంగళవారం రోజున ఈ ఎన్నిక జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(C P Radhakrishnan) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఎ) అభ్యర్థిగా పోటీలో ఉండగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి తరపున బరిలో ఉన్నారు.
ఓటింగ్ మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులందరూ ఓటు వేస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ 12 మంది సభ్యులు, లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది.
#Delhi: Opposition MPs attend a mock poll session in Central Hall of Parliament regarding the voting process for the Vice Presidential election.#VicePresidentialElection2025#MockPollpic.twitter.com/UyK9F6QhdX
— Prameya English (@PrameyaEnglish) September 8, 2025
Also Read : ఘోర విషాదం : గాఢ నిద్రలో ఉండగా పేలిన ఏసీ .. ముగ్గురు చనిపోయారు!
NDA కూటమికి 293 మంది
542 మంది సభ్యులున్న లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. 240 మంది సభ్యులున్న రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. మొత్తం మీద ఓటు కోసం రెండు సభల ఉమ్మడి బలం 786 వద్ద ఉంది. దీనితో గెలుపుకు394 ఓట్లు కావాల. 422 మంది సభ్యుల మద్దతుతో NDA ఆ మార్కును సులభంగా దాటుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికకు BRS, BJD దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంఐఎం ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయగా, వైసీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక(vice president elections) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం జరుగుతుంది. ఉపరాష్ట్రపతిని ప్రపోర్షనల్ రిప్రెజెంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ ద్వారా ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఈ ఎన్నికను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తి కావాలి.
ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థికి కింది అర్హతలు ఉండాలి:
కచ్చితంగా భారత పౌరుడై ఉండాలి.
35 సంవత్సరాలు నిండి ఉండాలి.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అర్హతలు కలిగి ఉండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో లాభదాయక పదవులలో ఉండకూడదు.
Also Read: కొన్ని రోజులు మాత్రమే సమయం.. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా తప్పదు!