Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ బ్యూటీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ కేసు విషయంలో నోటీసులు జారీ!

బిగ్ బాస్ బ్యూటీ సంజనా గల్రానీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటక డ్రగ్స్ కేసు విషయంలో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఓ డ్రగ్స్ కేసులో ఆమె 2020లో అరెస్టు అయి రెండు నెలలు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే.

New Update
SANJANA

Sanjjanaa Galrani

టాలీవుడ్ హీరోయిన్(tollywood-heroines) సంజనా గల్రానీ(sanjana Galrani) ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(bigg boss 9 telugu) లో ఉన్నారు. ఈమె ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే 2020లో ఈమె డ్రగ్స్ కేసుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈమె ఓ డ్రగ్స్ కేసులో 2020లో అరెస్టయ్యారు. నటి రాగిణి ద్వివేదితో పాటు ఈమె కూడా ఉన్నారు. 14వ నిందితురాలిగా ఈమె పేరు చేర్చారు. కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాలను వినియోగించడంతో పాటు ఆమె పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు జైలు శిక్ష విధించారు.

ఇది కూడా చూడండి: Chiranjeevi Vs Balakrishna: చిరు చెప్పిందే కరెక్ట్.. బాలయ్యకు ఆర్.నారాయణమూర్తి స్ట్రాంగ్ కౌంటర్

రెండు నెలలు జైలు శిక్ష..

సుమారుగా రెండు నెలల పాటు ఆమె జైలులో ఉన్న తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో కర్ణాటక హైకోర్టు గతేడాది మార్చి 25న రద్దు చేసింది. ఏడాదిలో వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకేసారి విచారణ జరపకూడదనే (సెక్షన్ 219 సీఆర్పీసీ) నిబంధన కారణంగా హైకోర్టు ఆమెకు ఉపశమనం కల్పించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైనే సంజనాకు తాజాగా నోటీసులు అందాయి. నైజీరియన్ డ్రగ్ డీలర్స్‌తో సంజనా సంప్రదింపులు జరిపినట్లు కాల్ రికార్డ్స్, ఫోరెన్సిక్ అంచనాలలో వెల్లడైందని, ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో మాదకద్రవ్యాలు విక్రయించిందని ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Mohan Babu: 'నాని'ని ఢీ కొట్టే శికంజా మాలిక్‌.. ‘ది ప్యారడైస్’ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ అదుర్స్..

Advertisment
తాజా కథనాలు