Mohan Babu: 'నాని'ని ఢీ కొట్టే శికంజా మాలిక్‌.. ‘ది ప్యారడైస్’ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ అదుర్స్..

నాని ‘ది ప్యారడైస్’లో మోహన్ బాబు శికంజా మాలిక్ అనే విలన్‌గా కొత్త లుక్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చి 26న ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. మోహన్ బాబు పాత్రకు భారీ స్పందన లభిస్తోంది.

New Update
Mohan Babu

Mohan Babu

Mohan Babu: న్యాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైస్’ నుంచి ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో మోహన్ బాబు పాత్ర పేరు శికంజా మాలిక్ అని వెల్లడించారు.

Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..

ఈ పోస్టర్‌లో మోహన్ బాబు లుక్ బోల్డ్‌గా, భయపెట్టేలా ఉంది. చేతులు రక్తంతో, నోట్లో సిగరెట్, కళ్ళకి బ్లాక్ గ్లాసెస్‌తో గంభీరంగా కనిపించారు. ఈ గెటప్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో మోహన్ బాబు పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

Mohan Babu First Look From The Paradise: 

నాని తన సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ, “పేరు శికంజా మాలిక్. డార్క్ లార్డ్ తిరిగి వస్తున్నాడు. మోహన్ బాబు గారి విలనిజం పీక్స్ కి తీసుకెళ్తున్నాం” అంటూ ఆసక్తికరంగా పేర్కొన్నారు.

ఈ పాత్ర కోసం మోహన్ బాబు బాడీ ఫిట్నెస్‌పై కూడా ఎక్కువగా కష్టపడుతున్నారని, ఆయన కూతురు లక్ష్మీ మంచు ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో వెల్లడించారు. “ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంటూ, షూటింగ్‌లో విద్యార్థిలా శ్రద్ధ చూపుతారు” అని చెప్పారు.

Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సినిమాతో నాని-శ్రీకాంత్ కాంబినేషన్ హిట్ అయ్యింది. మళ్లీ అదే కాంబోతో వస్తున్న ఈ చిత్రం SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.

ది ప్యారడైస్ చిత్రం 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది - తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్. ఇప్పటికే సినిమా టీజర్లు, BGM లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు