/rtv/media/media_files/2025/06/18/Sundeep Kishan grand mother passed away-fb87d40a.jpg)
Sundeep Kishan grand mother passed away
Sundeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నాన్నమ్మ ఆగ్నేస్ లక్ష్మీ 88 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఈ మేరకు సందీప్ తన నాన్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అలాగే నాన్నమ్మ మృతి పట్ల తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సందీప్ నాన్నమ్మ ఆగ్నేస్ లక్ష్మీ విశాపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహించారు. 1960 లో సందీప్ తాత కృష్ణం నాయుడిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/18/sundeep kishan grand mother-af5a032a.png)
సందీప్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చాడు.. ''నిన్న మా చివరి గ్రాండ్ పేరెంట్ మా నాన్నమ్మను కోల్పోయాము. మా తాత కృష్ణ నాయుడు ఒక షిప్ ఆర్కిటెక్ట్ అలాగే నాన్నమ్మ ఆగ్నెస్ విశాఖపట్నంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. వీరిద్దరిది 1960లలో జరిగిన ఇంటర్ రిలీజియన్ ప్రేమకథ. ఒక రకమైన సినిమా కథలా అనిపిస్తుంది. వివాహం చేసుకున్న తర్వాత.. తాతగారు జోసెఫ్ కృష్ణ నాయుడు & తాతగారు ఆగ్నెస్ లక్ష్మి అయ్యారు.నిజంగా నాకు తెలిసిన గొప్ప ప్రేమకథ వీరిది'' అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Also Read: Dhanush: ధనుష్ డైరెక్షన్ లో పవన్.కళ్యాణ్ ... 'కుబేరా' ఈవెంట్ లో హీరో కామెంట్స్ వైరల్!
Also Read : రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్రదేశం: బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్
hero-sundeep-kishan | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | tollywood-actor | tollywood-celebrities