/rtv/media/media_files/2025/05/31/qEyPDbTnM4dBPPjdhIip.jpg)
Opal Suchata Chuangsri, crowned Miss World Thailand 2025
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ ఎంపికయ్యాకయ్యారు. ఈమేకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. ఫైనల్ రౌండ్‌లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీళ్ల నలుగురిని అడిగిన ప్రశ్నలు అడగగా.. అందులో అత్యున్నత సమాధానం చెప్పిన థాయ్‌లాండ్‌కు బ్యూటీ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ఓపల్ సుచాతకు ధరించారు.
โอปอลทำได้แล้ว ที่สุดของที่สุดจริงๆ ที่สุดของความภาคภูมิใจไทยแลนด์ มงที่คาดหวังมาตลอดว่าจะได้สุดท้ายโอปอลก็คว้ามาได้จริงๆ Thailand ตอนนี้อวยยศป้าจูขั้นสูงสุด ปีหน้าจัดไทยนะคะ ✨️🇹🇭🩵#MissWorld#MissWorld2025#MissWorldThailand2025pic.twitter.com/sDO24HVLzy
— 𝑅𝑜𝒶𝒹 𝓉𝑜 𝑀𝒾𝓈𝓈 𝒯𝒽𝒶𝒾𝓁𝒶𝓃𝒹 2025 🇹🇭 (@roadtomissth) May 31, 2025
ที่หนึ่งของโลก เป็นของเธอแล้วนะ 👏🏻👏🏻👏🏻#โอปอลสุชาตา#Opalsuchata#MissWorld#MissWorld2025#MissWorldThailand2025pic.twitter.com/prnqKT9Tre
— ˚꒰🐈⬛⤾˚ (@_NARIN0s) May 31, 2025
ఇక మూడవ రన్నర్ అప్‌గా మిస్ మార్టినిక్, 2వ రన్నర్ అప్‌గా మిస్ పోలాండ్, 1వ రన్నర్ అప్‌గా ఇథియోపియా నిలిచారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనగా.. చివరికి థాయ్‌లాండ్‌కు చెందిన బ్యూటీ ప్రపంచ సుందరీ కిరీటాన్ని అందుకుంది. మన భారత్ నుంచి పోటీ చేసిన నందినీ గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇక ప్రముఖ నటుడు సోను సూద్‌కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఓపల్ సుచాత ఎవరు ?
ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ.. 2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని పుకేట్‌లో జన్మించారు. ప్రస్తుతం ఈమెకు కేవలం 21 ఏళ్లే. వీళ్ల కుటుంబం ఓ ప్రైవేట్ కంపెనీని నడుపుతోంది. ఆమె ప్రైమరీ, లోయర్ సెకండరీ విద్యను కాజోంకిట్సుక్సా స్కూల్‌లో పూర్తి చేసింది. ఆ తర్వాత ట్రయం ఉడోమ్ సుక్సా స్కూల్‌లో అప్పర్ సెకండరీ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం ఈమె.. థమ్మసాట్ యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. ఓపల్ సుచాత 2024లో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ కిరీటాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2024 మిస్ యూనివర్స్ పోటీలకు థాయ్‌లాండ్ నుంచి ప్రాతినిత్యం వహించారు. అక్కడ ఆమె మూడో రన్నర్ అప్‌గా నిలిచారు. తాజాగా 2025 మిస్ వరల్డ్ సుందరీగా విజయం సాధించారు.
มึง สู้มาตั้งกี่ครั้งนางสู้สุดใจตลอด ตอนนี้โลกเลือกโอปอลแล้ว มงฟ้าแรกของไทย กุสั่น😭😭😭😭 ดีใจกับน้องจริงๆๆๆๆๅ ฮือ #MissWorld#MissWorldThailand2025pic.twitter.com/tjrsN3w7C9
— ม้าเอมมาลี (@mumlovenn) May 31, 2025