Ghazala Hashmi: వర్జీనియా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా హైదారబాదీ గజాలా హష్మీ

భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఈమె భారత సంతతి వ్యక్తే కాదు...మన హైదరాబాదీ కూడా. రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ రీడ్‌ను ఆమె ఓడించారు.

New Update
gazala

Gazala Hashmi

వర్జీనియాలో డెమోక్రాట్లు దుమ్ము దులిపారు. అన్ని పోటీల్లో రిపబ్లికన్లను ఓడించి పదవులను దక్కించుకున్నారు. ఇందులో భారత సంతతి వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్(Virginia's New Lieutenant Governor) గా గజాలా హష్మీ(Ghazala Hashmi) ఎన్నికయ్యారు. ఈమె భారత సంతతి వ్యక్తి(Indian-American Democrat). హష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం మరియు మొదటి దక్షిణాసియా అమెరికన్ గజాలా.

Also Read :  మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలను ఫాలో అయిన న్యూయార్క్ కొత్త మేయర్

హైదరాబాద్ లో పుట్టి..

గజాలా హష్మి భారత సంతతి వ్యక్తే కాదు హైదరాబాదీ కూడా. ఇక్కడే జన్మించిన ఆమె...తనకు నాలుగేళ్ళు ఉన్నప్పుడు తల్లి, సోదరుడితో కలిసి అమెరికా వెళ్ళిపోయారు. ఆ తరువాత నుంచి అక్కడి చదువుకుని, పెరిగి పెద్దయ్యారు. ఆమె తండ్రి ఓ యూనివర్శిటీలో ప్రోఫెసర్ గా పని చేసేవారు. గజాలా.. జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు. అట్లాంటాలోనిఎమరివర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. ఆమె బాల్యం అంతా జార్జియాలోనే గడించింది. అజహర్ తో పెళ్ళయిన తరువాత గజాలా 1991లో రిచ్ మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2019లో ఆమె మొదటసారి అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో గజాలా హష్మి సెనేట్‌ విద్య, వైద్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.

Also Read: BIG BREAKING: న్యూ యార్క్ లో చరిత్ర సృష్టించిన జోహ్రాన్..మొదటి భారత సంతతి వ్యక్తి

Advertisment
తాజా కథనాలు