/rtv/media/media_files/2025/07/08/aamir-khan-named-jwala-guttas-son-2025-07-08-15-41-06.jpg)
Aamir Khan named Jwala Guttas son
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, నటుడు విష్ణు విశాల్ ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. పెళ్ళైన నాలుగేళ్ళ తర్వాత.. సరిగ్గా వారి వెడ్డింగ్ యానివర్సరీ రోజు( ఏప్రిల్ 22న) ఈ జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా బిడ్డ నామకరణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు ఈ జంట. హైదరాబాద్ లో జరిగిన వేడుకకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. అది మాత్రమే కాదు.. పాపకు స్వయంగా ఆయనే నామకరణం చేశారు. అమీర్.. ఆ చిన్నారికి 'మీరా' అని పేరు పెట్టారు. 'మీరా' అంటే 'శాంతి' 'షరతులు లేని ప్రేమ' అని అర్థం.
Also Read : శ్రీ రాముడు నేపాల్‌లో జన్మించాడు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Also Read : Chat GPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ
అమీర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ విషయాన్ని నటుడు విష్ణు విశాల్ తన సోషల్ మీడియాలో ద్వారా తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. అలాగే అమీర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా బిడ్డకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చిన ఆమిర్ ఖాన్ సర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆమిర్ సర్‌తో మా ప్రయాణం అద్భుతం" అని రాసుకొచ్చారు. . జ్వాలా గుత్తా కూడా అమీర్ లేనిది ఈ ప్రయాణం అసాధ్యమని, అందమైన, ఆలోచనాత్మకమైన పేరుకు ధన్యవాదాలు అని తెలిపింది. అమీర్ స్వయంగా ఈ వేడుకకు హాజరవడం, పాపకు పేరు పెట్టడం విశేషంగా మారింది.
విశాల్, అమీర్ బాండింగ్
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు విష్ణు విశాల్ అమీర్ తో తమ బాండింగ్ గురించి పంచుకున్నారు. అతడు, తన భార్య జ్వాల IVF కోసం అనేకసార్లు ప్రయత్నించి చివరికి ఆశలు వదులుకునే పరిస్థితికి వెళ్లారట. ఆ సమయంలో అమీర్ తమకు హెల్ప్ చేసినట్లు తెలిపారు. తమను ముంబైలోని ఒక వైద్యుని వద్దకు పంపి సరైన మెడికల్ గైడెన్స్ ఇచ్చారని.. అదే ఈరోజు మా సంతోషానికి కారణమైందని చెప్పారు. అంతేకాదు చికిత్స కోసం జ్వాలా ముంబైలోనే ఉండాల్సి రావడంతో 10 నెలల పాటు అమీర్ ఇంట్లోనే ఉందని.. ఆ సమయంలో అమీర్ తల్లి, ఆయన సోదరీమణులు జ్వాలను ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకున్నారని కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
Also Read : హైదరాబాద్‌లో బాంబు బెదిరింపులు...బాంబు స్క్వాడ్ షాక్...
Aamir Khan | Latest News | telugu-news