India US Trade Deal : ఈ రోజు రాత్రి 10 గంటలకు ఏం జరగబోతుంది? భారత్‌, యూఎస్‌ మధ్య కీలక డీల్‌....

ఇండియా-అమెరికా మధ్య మధ్యంతర  ట్రేడ్ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ట్రంప్‌ తొలుత విధించిన 26 శాతం టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఈ రాత్రి 10 గంటలకు ట్రేడ్‌ డీల్‌ ప్రకటన వెలువడనుంది.

New Update
India US Mini Trade Dea

India US Mini Trade Deal

ఇండియా- అమెరికా మధ్య మధ్యంతర  ట్రేడ్ డీల్ ఖరారు అయింది. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ట్రంప్‌ తొలుత విధించిన 26 శాతం టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గంటలకు మినీ ట్రేడ్‌ డీల్‌ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది స్పెషల్‌ అని ఇటీవల ట్రంప్‌ వెల్లడించారు. దీంతో అదేంటన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 14 దేశాలకు టారిఫ్‌లపై లేఖలు పంపిన ట్రంప్‌ ఆగస్టు 1 నుంచి అవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

Also Read : తోడుంటాడని పెళ్లిచేసుకుంటే..రూ. 28 కోట్లు దోచుకున్నాడు..

India US Mini Trade Deal Likely Finalised

 వ్యవసాయం, డైరీ రంగాలపై భారత్ ధృడమైన వైఖరి,  యూఎస్  టారిఫ్ తగ్గింపు డిమాండ్లు చర్చలు పూర్తి కాకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో  చాలా కాలంగా ఎదురుచూస్తున్న మినీ ట్రేడ్ డీల్‌ను ఖరారు  చేసుకోనున్నాయి. నిర్దిష్ట వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడం , ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యంగా ఉంది.ఇందులో సుంకాల తగ్గింపులు, కీలక వస్తువులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్ ,  డిజిటల్ వాణిజ్యం , క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరస్పర  సహకారం ఉంటాయని పారిశ్రామిక వర్గాలు  వెల్లడించాయి. 

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

చాలా నెలలుగా ఈ విషయంలో  కొనసాగుతున్న చర్చలు, సీనియర్ వాణిజ్య అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చల తర్వాత ఒక పురోగతిని సాధించాయని తెలుస్తోంది.  భవిష్యత్తులో రెండు దేశాల మధ్య విస్తృత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వైపు ఈ ఒప్పందం ఒక మార్గంగా ఉపయోగపడుతుందని పారిశ్రామిక వర్గాలు అంచనాకు వస్తున్నాయి.

Also Read : హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

భారతదేశానికి చెందిన వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్‌లో జూన్ 26 నుండి  అమెరికా అధికారులతో చర్చలు జరుపుతోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఒప్పందం పరస్పర ప్రయోజనకరంగా ఉండాలని, ఏకపక్షంగా ఏమీ నిర్ణయించబడదని ప్రకటించారు.  టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ గూడ్స్, గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కెమికల్స్, ష్రిమ్ప్, ఆయిల్ సీడ్స్, గ్రేప్స్, , బనానాస్ వంటి ఉత్పత్తులపై పన్ను తగ్గింపులు ఉండే అవకాశం ఉంది.  ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి  500 బిలియన్ డాలర్లకు  చేర్చాలని లక్ష్యంతో భారత్ ఉంది. ప్రస్తుతం ఇది  131.84 బిలియన్ డాలర్లుగానే ఉంది. మినీ ట్రేడ్ డీల్ పై ప్రకటన తర్వాత పూర్తి స్థాయి ట్రేడ్ డీల్ పై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.      

Also Read: ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

donald trump latest news | Donald Trump | america trade deal with US | Jaishankar On India-US Trade Deal | india-us-relations | india us tariffs

Advertisment
Advertisment
తాజా కథనాలు