/rtv/media/media_files/2025/10/30/shilpa-shetty-spotted-at-lilavati-hospital-2025-10-30-16-15-04.jpg)
Shilpa Shetty spotted at Lilavati Hospital
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి(shilpa-shetty) తల్లి సునంద శెట్టి గురించి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. నటి తల్లి ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. తాజాగా తన తల్లిని చూసేందుకు నటి శిల్పా శెట్టి హాస్పిటల్‌కు వెళ్లారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : ఉఫ్.. నెట్టింట సెగలు పుట్టిస్తున్న పొడువుకాళ్ల సుందరి.. చిట్టీ హాట్ ఫొటో షూట్!
Shilpa Shetty Spotted At Lilavati Hospital
— jyoti singh (@jyotisingh24061) October 30, 2025
ఆ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘‘శిల్పా శెట్టి(bollywood-actress-shilpa-shetty) ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేరుకుంది’’ అనే క్యాప్షన్ పెట్టాడు. అందులో నటి శిల్పా శెట్టి తన కారు దిగి త్వర త్వరగా హాస్పిటల్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన శిల్ప అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
అదే సమయంలో నటి తల్లి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా శిల్ప శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి 2016 లో మరణించారు. అప్పటి నుండి నటి తన తల్లి సునందకు మరింత దగ్గరైంది. ఆమె ఎప్పుడూ తన తల్లితోనే ఉంటూ తరచుగా సోషల్ మీడియాలో తన తల్లితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను కురిపిస్తూ ఉంటుంది.
Also Read : SSMB29 షూటింగ్ కి బ్రేక్.. మాల్దీవ్స్ లో మహేష్ బాబు! ఫొటోలు చూశారా?
Shilpa Shetty spotted at Lilavati Hospital as mother Sunanda Shetty is hospitalised.🏥❤️🩹#shilpashettypic.twitter.com/aD0BsHbnmr
— Buzzzooka Prime (@Buzzzookaprime) October 30, 2025
ఇదిలా ఉంటే శిల్పా శెట్టి చివరిసారిగా 2022లో విడుదలైన ‘నికమ్మ’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఒక డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జిగా కూడా చేసింది. ఇప్పుడు ఆమె లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నాయి. కాగా శిల్పా శెట్టి ఇటీవల జోరుగా వార్తల్లో నిలిచింది. ఆమె రూ.60 కోట్ల మోసం కేసులో చిక్కుకుంది. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ఉన్నారు.
Follow Us